Breaking News

అక్కడికి రా.. ప్రమాణం చేద్దాం?.. సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ సవాల్‌

Published on Sun, 10/15/2023 - 18:42

సాక్షి, హైదరాబాద్‌: ‘కాంగ్రెస్ నిర్ణయాలు కాపీ కొట్టడంలో కేసీఆర్ బిజీబిజీ అయ్యారు.. మా అభ్యర్థులను ప్రకటించే దాకా కేసీఆర్ బీఫారం లు ఇవ్వలేదు’’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మేం 55 మందిని ప్రకటిస్తే కేసీఆర్ 51 మందికే బీ ఫామ్‌లు ఇచ్చారు. కేసీఆర్ లాగా మేం ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదు. మేం ఇచ్చిన హామీలన్నీ ఆచరణకు సాధ్యమే’’ అని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

‘‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలు సాధ్యమేనని కేసీఆర్ రాజముద్ర వేశారు. మా ఆరు గ్యారెంటీ స్కీమ్‌లకే కొంత డబ్బులు పెంచారు. మా గ్యారెంటీ స్కీమ్‌ చూసి కేసీఆర్ పెద్ద లోయలో పడిపోయారు. కేసీఆర్‌కి ఆలోచన చేసే శక్తి తగ్గిపోయింది. కేసీఆర్ ఇప్పుడు పరాన్నజీవి’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ హామీలను కేసీఆర్ తన మేనిఫెస్టోలో పెట్టారు. రాబోయే ఎన్నికల్లో పైసా ఇవ్వకుండా, మందు పోయకుండా ప్రజల్లోకి వెళ్దామా?. 17న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్ద నువ్వు, నేను ప్రమాణం చేద్దామా? అంటూ రేవంత్‌ సవాల్‌ విసిరారు.

‘‘నవంబర్ నెల 1వ తేదీన పెన్షన్లు, జీతాలు వేస్తే కేసీఆర్‌ను ప్రజలు నమ్ముతారు. కేసీఆర్ ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్‌లో వేసినట్టు పాత అంశాలను మేనిఫెస్టోలో పెట్టారు. మేం పొగ పెడితే బొక్కలో ఉన్న ఎలుక బయటకి వచ్చింది. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్.. కేసీఆర్ ఎక్పైరీ డేట్ అయిపోయింది.  కేసీఆర్ ఎన్నికల బరిలో నుండి తప్పుకుంటే మంచిది’’ అంటూ రేవంత్‌ వ్యాఖ్యానించారు.
చదవండి: బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో.. కేసీఆర్‌ హామీలివే.. 

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)