Breaking News

కాంగ్రెస్‌లో జోష్‌.. పొంగులేటి ఇంటికి రేవంత్‌రెడ్డి

Published on Wed, 06/21/2023 - 16:42

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక లాంఛనప్రాయం నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారబోతున్నాయి. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు క్యాడర్ ఉన్న లీడర్ లేని లోటు ఉన్న నేపథ్యంలో పొంగులేటి చేరికతో జిల్లాలో బలం పెరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి బుధవారం.. హైదరాబాద్‌లోని జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలకు వెళ్లి వారిని కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా  పొంగులేటి నివాసంలో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలన్నారు. ‘‘అత్యంత అవినీతి పరుడైన కేసీఆర్‌ను గద్దె దించాలి. ఖమ్మం జిల్లా ముఖ్య నేతలను మాతో కలిసి రావాలని ఆహ్వానించాం. ఖమ్మం నేతలంతా పొంగులేటి రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు అందించడమే మా లక్ష్యం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

ప్రజల బాగోగులే ముఖ్యం: కోమటిరెడ్డి
అప్పులు తీసుకొచ్చి రోడ్లు కూడా వేయలేదని, బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ధరణి పేరుతో రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మాకు అధికారం కాదు.. ప్రజల బాగోగులే ముఖ్యం అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
చదవండి: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని బొందపెట్టాల్సిన అవసరం ఉంది: జూపల్లి

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)