Breaking News

‘జైలును తప్పించుకునేందుకే పార్టీ ఫిరాయించాను’

Published on Sat, 05/11/2024 - 12:42

ముంబై: మహారాష్ట్రలోని ముంబై వాయువ్య లోక్‌సభ నియోజకవర్గ శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్‌, జైలును తప్పించుకునేందుకే తాను శివసేన (యూబీటీ) నుంచి ఫిరాయించానని ప్రకటించి తన పార్టీని ఇరుకున పడేశారు. జోగేశ్వరిలోని సివిక్ ప్లాట్‌లో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి సంబంధించి ఈడీ ఆయనపై పీఎంఎల్‌ఏ కేసు నమోదు చేసింది.

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరడం మినహా తనకు వేరే మార్గం లేదని ఒక మరాఠీ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీంద్ర వైకర్ పేర్కొన్నారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరేకు అత్యంత విధేయుడిగా రవీంద్ర వైకర్ పేరుగాంచారు. ఉద్ధవ్ థాకరే స్వయంగా వైకర్‌ నివాసానికి వెళ్లి బుజ్జగించారంటేనే ఆయనకు శివసేన (యూబీటీ) ప్రాధాన్యత ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు.

తన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగడంతో రవీంద్ర వైకర్ దిద్దుబాటుకు ప్రయత్నించారు.  ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. శివసేన (యూబీటీ) నుండి వైదొలగే ముందు తాను ఉద్ధవ్‌తో మూడు సార్లు సమావేశమయ్యానని, తన ఇబ్బందులను తెలియజేశానని చెప్పారు.

కాగా ముంబై నార్త్-వెస్ట్ స్థానంలో శివసేన (యూబీటీ)కి చెందిన అమోల్ కీర్తికర్‌తో వైకర్ పోటీలో ఉన్నారు.  అమోల్‌ తండ్రి కీర్తికర్‌ ప్రస్తుతం ఇక్కడ సిటింగ్‌ ఎంపీ. ఈ లోక్‌సభ స్థానానికి ఐదో దశలో మే 20న పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)