Breaking News

‘24 గంటల్లో శశిథరూర్‌ నాకు క్షమాపణ చెప్పాల్సిందే’

Published on Wed, 04/10/2024 - 14:33

తిరువనంతపురం : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేరళ రాజకీయం వేడెక్కుతుంది. తిరువనంతపురం లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి రాజీవ్‌ చంద్రశేఖర్‌.. అదే స్థానం నుంచి  బరిలోకి దిగుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభ అభ్యర్ధి శశిథరూర్‌కు లీగల్‌ నోటీసులు పంపారు. శశిథరూర్‌ తనకు భేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే చట్టపర్యమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   

కేరళకు మలయాళ మీడియా సంస్థ న్యూస్‌24 ఇంటర్వ్యూలో శశిథరూర్‌.. రాజీవ్‌ చంద్రశేఖర్‌ గురించి మాట్లాడారు. ఏప్రిల్‌ 6న సదరు టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఓటర్లను, ఓ వర్గానికి చెందిన మత పెద్దలకు డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురిచేస్తున్నారనే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తరుపున లాయర్‌ ద్వారా శశిథరూర్‌కు లీగల్‌ నోటీసులు అందించారు.     

నేనే షాకయ్యా
తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ధి తన గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని, ఓటర్లకు డబ్బులిస్తూ ప్రలోభ పెడుతున్నారంటూ నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలు నన్ను షాక్‌కి గురి చేశాయని ఆ నోటీసుల్లో రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.  

క్షమాపణలు చెప్తారా? లేదంటే
ఈ నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోపు శశిథరూర్‌ చేసిన వ్యాఖ్యల్ని తిరిగి వెనక్కి తీసుకోవాలని, ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలని అన్నారు. అంతేకాదు తనకు, ఓటర్లకు, ఓ కమ్యూనిటీని కించపరిచినందుకు ఆ  వర్గానికి చెందిన ప్రజలకు, మత పెద్దలకు బహిరంగంగా క్షమాణలు చెప్పాలని హెచ్చరించారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శశిథరూర్‌కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. 

రాజకీయంగా లబ్ధి పొందాలనే 
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేలా దుర్మార్గపు ఉద్దేశ్యంతో తన క్లయింట్‌ రాజీవ్‌ చంద్రశేఖర్‌ పరువుకు నష్టం వాటిల్లేలా అసత్యప్రచారం చేశారు. తద్వారా ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని, శశిథరూర్‌ క్షమాపణలు చెప్పాలని రాజీవ్‌ చంద్రశేఖర్‌ తరుపు న్యాయవాది శశిథరూర్‌కు పంపిన నోటీసుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)