Breaking News

అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ వర్గీయుల మధ్య ఘర్షణ..వీడియో వైరల్..

Published on Fri, 05/19/2023 - 10:50

జైపూర్‌: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌లో సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య చాలాకాలంగా వర్గపోరు నడుసున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిది పతాక స్థాయికి చేరింది. ఇరు నేతల మద్ధతురాలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. అజ్మేర్‌లో డీసీసీ నిర్వహించిన సమావేశం ఇందుకు వేదికైంది.

కాంగ్రెస్ బేరర్లు, కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ఏఐసీసీ కార్యదర్శి, రాజస్థాన్ కో-ఇంఛార్జ్ అమృత ధావన్‌ గురువారం అజ్మేర్ వెళ్లారు. అయితే ఈ సమావేశానికి వచ్చిన అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మద్దతుదారుల మధ్య సీట్ల అరేంజ్‌మెంట్ విషయంలో గొడవ జరిగింది. ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. అజ్మేర్‌లో సచిన్ పైలట్ మద్దతుదారులు ఎక్కువ ఉండటంతో వారంతా తమ నేతకు అనుకూలంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఇరువర్గాలను శాంతింప చేసేందుకు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం అమృత ధావన్.. కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు, కార్యకర్తల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని వెళ్లిపోయారు.

కాగా.. అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై సొంత పార్టీ నేత అయిన సచిన్ పైలట్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, మాజీ సీఎం వసుందర రాజేతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని పైలట్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపైనే ఐదురోజుల పాదయాత్ర కూడా చేసి నిరసన వ్యక్తం చేశారు.

చదవండి: ముళ్ల కిరీటం కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం.. ఐదేళ్లూ కొనసాగడం కత్తిమీద సామే

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)