Breaking News

సీఎం మమతాకు మద్దతుగా! ప్రధాని మోదీకి రాహుల్‌ గాంధీ లేఖ

Published on Mon, 02/12/2024 - 22:04

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ పశ్చిమ బెంగాల్‌లోని గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికుల సమస్యను వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం లేఖ రాశారు. కేంద్రం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంపై అవలంభిస్తున్న తీరును నిరసిస్తూ.. సీఎం మమతా బెనర్జీ గతంలో చేసిన డిమాండ్‌కు మద్దతుగా రాహుల్‌ గాంధీ ప్రధానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. 

‘నేను పశ్చిమ బెంగాల్‌లో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికుల దుస్థితి తెలపాడానికి లేఖ రాస్తున్నా. నేను చేపట్టిన ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ సందర్భంగా బెంగాల్‌లోని ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కార్మికుల పరిస్థితి స్వయంగా గమనించారు. వారు కూడా పెద్ద ఎత్తున నా యాత్రలో పాల్గోని తమ సమస్యలపై వినతిపత్రం అందించారు కూడా.  

..పశ్చిమ బెంగాల్‌లో ఉపాధి హామి కార్మికుల ఇబ్బందులను తెలుపుతూ పశ్చిమ్ బంగా ఖేత్ మజ్దూర్ సమితి నాయకులు నాకు వినతిపత్రం అందజేశారు. వారు రాసిన లేఖ ప్రతిని కూడా మీకు జత చేశాను. 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం.. ఉపాధి హామీ పథకం కింద విడుదల చేసే నిధులను నిలిపివేయటంతో లక్షలాది పశ్చిమ బెంగాల్‌ సోదరీ సోదరీమణులు వేతనాలు అందక ఆర్థికంగా చితికి పోతున్నారు.’అని రాహుల్‌ గాంధీ లేఖలో పేర్కొన్నారు. 

ఇక.. మమతా బేనర్జీ టీఎంసీ ప్రభుత్వం అనేకసార్లు కేంద్రం నిధులు విడుదల చేయాలని నిరసన వ్యక్తం చేశాయి. అఖరికి ఫిబ్రవరి 21 వరకు పెండింగ్‌లో ఉన్న సుమారు 21 లక్షల ఉపాధిహామీ పథకం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు అందజేస్తుందని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. గత ఏదాడి డిసెంబర్‌లో కూడా సీఎం మమతా.. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలకు సంబంధించి ప్రధాని మోదీతో భేటీ అయి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.   

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ సారథ్యంలోని  ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’తో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తమ టీఎంసీ పార్టీ ఒంటిరిగా పోటీ చేస్తుందని సీఎం మమతా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మమతాను బుజ్జగించే పనిలో భాగంగా తాజాగా అక్కడి గ్రామీణ ఉపాథి హామీ పథకం కార్మికుల నిధులకు విడుదలకు కేంద్రం చేస్తున్న జాప్యం గురించి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు జోరుగా చర్చ జరుగుతోంది.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)