Breaking News

నాపై ఈడీ దాడులు.. చాయ్‌ బిస్కెట్లతో వెల్‌కమ్‌: రాహుల్‌ గాంధీ

Published on Fri, 08/02/2024 - 08:28

న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ కేంద్రంపై సంచలన ఆరోపణలకు దిగారు. తనపై త్వరలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు చేసే అవకాశం ఉందని అన్నారాయన. అందుకు తన చక్రవ్యూహ్‌ ప్రసంగమే కారణమని చెబుతూ ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ ఉంచారు. : రాహుల్‌ గాంధీ

నాపై ఈడీ దాడులు జరగొచ్చు. ఓ అధికారి నుంచి నాకు దానిపై సమాచారం వచ్చింది. జులై 29న నేను పార్లమెంటులో చేసిన ‘చక్రవ్యూహం’ స్పీచ్‌ కొందరికి నచ్చలేదు. ఈడీ విచారణ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా.. అదీ ఛాయ్‌ బిస్కెట్లతో అని ఛమత్కారంగా ఓ సందేశం ఉంచారాయన. 

 

 పార్లమెంట్‌లో ఈ మధ్య ప్రవేశపెట్టిన.. కేంద్ర బడ్జెట్‌ 2024-25పై లోక్‌సభ చర్చ జరిగింది. సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తూ.. ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని ‘పద్మవ్యూహం’లోకి నెట్టివేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తదితరులపై విమర్శలు సంధించారు. 

 

దేశ సంపద మొత్తాన్ని కబళించాలని చూస్తున్న ఇద్దరు వ్యక్తులు మొదటి శక్తి కాగా, దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ రెండోదని తెలిపారు. రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని మూడో శక్తిగా రాహుల్‌ అభివర్ణించారు. ఇవి దేశాన్ని విధ్వంసం చేస్తున్నాయని దుయ్యబట్టారు.

మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని, వీరమరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ.. ‘‘అభిమన్యుడిని చక్రవ్యూహంలో ఎలా హత్య చేశారో.. ఇప్పుడు దేశాన్నీ అదే చేయబోతున్నారు. యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్య తరహా వ్యాపారుల చుట్టూ దాన్ని పన్నుతున్నారు. ఈ రోజు కూడా పద్మవ్యూహం పన్నిన వారిలో ఆరుగురే ఉన్నారు’’ అని రాహుల్‌ ధ్వజమెత్తారు. 

 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)