Breaking News

‘ప్యాడ్‌ మ్యాన్‌’గా రాహుల్‌ గాంధీ.. కాంగ్రెస్‌ ప్రచారంపై రాజకీయ దుమారం

Published on Fri, 07/04/2025 - 16:53

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ చేపట్టిన ఎన్నికల వ్యూహం బెడిసికొట్టిందా?. అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన ప్యాడ్‌ మ్యాన్‌ సినిమా స్పూర్తితో కాంగ్రెస్‌ మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో కాంగ్రెస్‌కు భంగపాటు ఎదురైనట్లు సమాచారం. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మై బహన్ మాన్ యోజన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ బీహార్‌లోని ఐదులక్షల మంది మహిళలకు శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ఆరోగ్యంపై అవగాహన పెంచే ప్రయత్నంగానే ఉన్నా.. మహిళలకు అందించే శానిటరీ ప్యాడ్లపై వివాదం రాజుకుంది. శానిటరీ ప్యాడ్ కవర్‌పై రాహుల్ గాంధీ ఫోటోతో పాటు, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన మై బహన్ మాన్ యోజన పథకం వివరాలు ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ మహిళలకు అందించే శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ ఫోటో ముద్రించడంపై బీజేపీ, ఇతర పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు మహిళల్ని కించపరిచేలా, వారి గౌరవాన్ని తక్కువ చేసేలా ప్రచారం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది. బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి ‘రాహుల్ ఫోటోతో శానిటరీ ప్యాడ్ పంపిణీ చేయడం మహిళల్ని అవమానించినట్లేనని ’ అని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్‌ మాత్రం బీజేపీ విమర్శల్ని ఖండిస్తోంది. నెలసరి సమయంలో మహిళల బాధల్ని ప్రపంచానికి చూపేలా శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. 

మై బహన్ మాన్ యోజన పథకం వివరాలు 
ఈ పథకం ద్వారా అర్హత కలిగిన మహిళలకు నెలకు రూ.2,500 నేరుగా నగదు సహాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇది ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే లక్ష్యంగా రూపొందించినట్లు చెప్పింది.  మహిళల గౌరవాన్ని, ఆత్మగౌరవం ప్రతిబింబించేలా ఈ పథకం పేరు మై బహన్ మాన్ అని పెట్టినట్లు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. మరోవైపు, నితీష్ కుమార్ ప్రభుత్వం కూడా మహిళా సంభాషణ అనే కార్యక్రమం ద్వారా 2 కోట్ల మహిళలతో నేరుగా సంప్రదింపులు జరుపుతోంది. 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)