Breaking News

వయనాడ్‌కే రాహుల్‌ టాటా!

Published on Sat, 06/08/2024 - 21:31

లోక్ సభ ఎన్నికలలో యూపీలోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్ నుంచి మూడు లక్షల పైచిలుకు మెజారిటీ గెలుపు సాధించిన రాహుల్ గాంధీ.. రూల్స్‌ ప్రకారం ఏదో ఒక సీటును వదులుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇవాళ జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(CWC) భేటీలో ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఆయన కేరళ వయనాడ్‌ సీటునే వదులుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం.. ఒకరు ఒక స్థానం కంటే ఎక్కువ చోట్ల నుంచి పోటీ చేయొచ్చు. కానీ, ప్రాతినిధ్యం మాత్రం ఒక్క స్థానం నుంచే వహించాలి. ఫలితాలు వెలువడిన 14 రోజుల్లో ఒక స్థానానికి కచ్చితంగా రాజీనామా చేయాలి. అలా జరగని పక్షంలో ఆ రెండు స్థానాలను ఆ వ్యక్తి కోల్పోవాల్సి వస్తుంది. అయితే అటు కేరళ, ఇటు ఉత్తర ప్రదేశ్‌ సీనియర్లు మాత్రం రాహుల్‌ తమ రాష్ట్రంలోనే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు.     

సీడబ్ల్యూసీ భేటీలో యూపీ కాంగ్రెస్‌ నేత ఆరాధన మిశ్రా.. రాయ్‌బరేలీ గాంధీ కుటుంబానికి చెందిందని, కాబట్టి దానిని వదులుకోకూడదని సూచించారు. అయితే 80 లోక్‌సభ సీట్లున్న ఉత్తర ప్రదేశ్‌లో పార్టీని పటిష్టం చేయడానికి రాహుల్‌ కొనసాగాల్సిన అవసరం ఉందని పలువురు కోరారు. 

మరోవైపు కేరళ నేతలు కూడా వయనాడ్‌ నుంచే కొనసాగాలని కోరినట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి రెండోసారి గెలిపించినందున ఈ సీట్లోనే కొనసాగాలని కేరళ కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.  అయితే. ఉత్తర ప్రదేశ్‌లో పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించడం కోసం ఈ సీటును అట్టిపెట్టుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తుస్తోంది. యూపీపై దృష్టి సారించాల్సి ఉందన్న అధిష్ఠానం సూచనల మేరకు కేరళ కాంగ్రెస్ నాయకులు కూడా ఆ తర్వాత అందుకు అంగీకరించారని తెలుస్తోంది.

మరోవైపు, రాహుల్ గాంధీ వదులుకుంటే కనుక, అదే వ‌య‌నాడ్ నుంచి ప్రియాంకా గాంధీని పోటీ చేయించాలన్న విజ్ఞప్తిని కూడా గాంధీ కుటుంబం తిరస్కరించిందని చెబుతున్నారు. కేరళకు చెందిన సీనియర్ నేతను ఇక్కడి నుంచి బరిలోకి దించాలని భావిస్తున్నారు. వచ్చేవారం రాయ్‌ బరేలీలో సోనియా కుటుంబం పర్యటించనుంది. ఆ తర్వాతే రాహుల్‌ గాంధీ  ఏ సీటును వదులుకుంటారనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జూన్‌ 17వ తేదీలోపు దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడనుంది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)