Breaking News

‘ఈ20’ పెట్రోల్‌ ‘420’గా మారింది

Published on Sat, 11/07/2026 - 16:34

సాక్షి, న్యూఢిల్లీ:  పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలపాల్సి ఉండగా, అంతకంటే ఎక్కువ మోతాదులో కలుపుతున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చెబుతున్న ‘ఈ20’పెట్రోల్‌ విధానం వాస్తవానికి ‘420’గా మారిందని మండిపడ్డారు. ప్రజల వాహనాల్లోని పెట్రోల్‌ను దొంగిలిస్తున్నారని ధ్వజమెత్తారు. కర్ణాటక ప్రభుత్వం ఏడు జిల్లాల్లో పెట్రోల్‌ బంకుల నుంచి నమూనాలు సేకరించి, గుర్తింపు పొందిన ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించగా, నిర్దేశిత పరిమితికి మించి ఇథనాల్‌ ఉన్నట్లు వెల్లడైందని పేర్కొన్నారు. 

ఈ మేరకు రాహుల్‌ గాంధీ శనివారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. 14 నమూనాలను పరీక్షంగా 11 నమూనాల్లో ఇథనాల్‌ 20 శాతం దాటినట్లు వెల్లడించారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌కు చెందిన నమూనాలో 31.2 శాతం, హిందుస్థాన్‌ పెట్రోలియం నమూనాలో 30.5 శాతం ఇథనాల్‌ ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌తో పాటు ప్రైవేట్‌ సంస్థలైన నయారా, షెల్‌ విక్రయ కేంద్రాల నుంచి సేకరించిన నమూనాల్లోనూ 20 శాతానికి మించి ఇథనాల్‌ ఉన్నట్లు ఆక్షేపించారు. ఆయా సంస్థల సొంత ప్రయోగశాలలు మాత్రం ఇథనాల్‌ శాతాన్ని వెల్లడించలేదని విమర్శించారు.  

వాహనదారులే నష్టపోతున్నారు  
అధిక ఇథనాల్‌ వల్ల సామాన్య వాహనదారులే నష్టపోతున్నారని రాహుల్‌ గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. అధిక ధర చెల్లించి పెట్రోల్‌ కొనుగోలు చేస్తున్న ప్రజలకు అందులో ఎంతశాతం ఇథనాల్‌ ఉందన్న విషయం తెలియడం లేదన్నారు. వాహనాలు నిర్దిష్ట స్థాయి ఇథనాల్‌ మిశ్రమాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించినవని, 

అంతకంటే ఎక్కువ మోతాదులో కలిపితే మైలేజీ తగ్గడంతోపాటు మరమ్మతుల కోసం తరచూ మెకానిక్‌ వద్దకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. మోతాదు మించిన ఇథనాల్‌ వల్ల వాహనాలు దెబ్బతింటాయని వెల్లడించారు. పెట్రోల్‌ బంకుల్లోని ట్యాంకులోకి ఏ రకమైన ఇంధనం వెళ్తోంది, అందులో ఇథనాల్‌ శాతం ఎంత అనే వివరాలు తెలిపే సూచికలు లేవన్నారు. 

వినియోగదారులకు తమకు నచ్చిన ఇంధనాన్ని ఎంచుకునే అవకాశం లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న పెట్రోల్‌లో వాస్తవంగా ఎంతశాతం ఇథనాల్‌ కలుపుతున్నారు? 20 శాతానికి మించి ఇథనాల్‌ కలుపుతున్న సంస్థలపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? అని కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్‌ గాంధీ నిలదీశారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రయోజనం పొందుతున్నది ఎవరు? ప్రజలకు కలుగుతున్న నష్టానికి బాధ్యత ఎవరిది? అని ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలపై చర్చిద్దామంటూ తాను ఇప్పటికే విసిరిన సవాలు కొనసాగుతోందని, ఇథనాల్‌ మిశ్రమ అంశాన్ని కూడా ఇందులో చేర్చనున్నట్లు స్పష్టం చేశారు.  

ఇదీ చదవండి: మత్తులో మునిగే ముఖ్యమంత్రి  డ్రగ్స్‌పై పోరాడగలరా?

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)