Breaking News

ప్రధాని అభ్యర్థిగా ఖర్గేనే.. నితీష్‌కు రాహుల్ ఫోన్

Published on Fri, 12/22/2023 - 12:50

ఢిల్లీ: ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేసే అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టతనిచ్చారు. ఇందుకు కాంగ్రెస్ కూడా మద్దతునిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు ఫోన్‌ చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లు ఖర్గే పేరును ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. దేశానికి తొలి దళిత వ్యక్తిని పీఎంగా ప్రకటించిన ఘనత కూడా దక్కుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటనను ఎమ్‌డీఎమ్‌కే నేత వైకోతో సహా పలువురు ఇండియా కూటమి నేతలు మద్దతు పలికారు. 

ఫోన్ కాల్ సందర్భంగా ఇండియా కూటమి బలాబలాలపై రాహుల్, నితీష్ కుమార్ చర్చించుకున్నారు. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరు ప్రస్తావన తనకు తెలియదని నితీష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ఇదే క్రమంలో బిహార్‌ కేబినెట్‌లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్యను పెంచుతానని నితీష్ హామీ ఇచ్చారు. కాగా.. 2024 లోక్‌సభ ఎన్నికలకు తమ అభ్యర్థులను అతి త్వరలో నిర్ణయిస్తామని కాంగ్రెస్ గురువారం తెలిపింది. 

ఢిల్లీలో ఇటీవల కాంగ్రెస్ సీడబ్ల్యూసీ మీటింగ్ నిర్వహించింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని నేతలకు పిలుపునిచ్చింది. రాహుల్ భారత్ జోడో యాత్ర 2.0(తూర్పు-పశ్చిమం) చేయాలని ఈ సమావేశంలోనే నేతలు కోరారు. ఈ భేటీలో పాల్గొన్న 76 మంది నేతలు దేశంలో కాంగ్రెస్ భవిష్యత్‌పై చర్చించారు.    

ఇదీ చదవండి:  ఎంపీల సస్పెన్షన్‌పై నేడు దేశవ్యాప్త నిరసనకు విపక్ష నేతల పిలుపు

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)