Breaking News

లోక్‌సభలో ప్రతిపక్షనేతగా 100 రోజులు.. రాహుల్‌ ఏమన్నారంటే..

Published on Fri, 10/04/2024 - 20:06

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. లోక్‌సభలో ప్రతిపక్షనేతగా బాధ్యతలు చేపట్టి నేటికి(శుక్రవారం) 100 రోజులు పూర్తయ్యింది. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ స్పందిస్తూ.. దేశ రాజకీయాల్లో ప్రేమ, గౌరవం, వినయాన్ని పునరుద్దరించడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. మరింత న్యాయబద్దంగా, ఆర్థికంగా సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి మనం కలిసి పని చేస్తున్న సమయంలో ఈ సూత్రాలే తనకు మార్గనిర్దేశం చేస్తాయని చెప్పారు.

కాగా ప్రతిపక్ష నాయకుడిగా అవతరించిన తర్వాత గాంధీ.. ఎన్నో గుర్తుండిపోయే ప్రసంగాలు, బీజేపీపై పదునైన వ్యాఖ్యలతో విమర్శలు చేశారు. పార్లమెంటులో ఎన్నో సమస్యలపై ప్రశ్నించారు. నీట్‌ పేపర్‌ లీక్‌ సమస్యపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హింసాత్మక మణిపూర్‌ వంటి అనేక సంఘటనలు జరిగిన ప్రాంతాలను సందర్శించి, అక్కడి వారితో సమావేశమయ్యారు. అంతేగాక జమ్ముకశ్మీర్‌, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించి ప్రచారం నిర్వహించారు.

ఇదిలా ఉండగా పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్‌కు లోక్‌సభలో ప్రతిపక్షనేత పదవిని పొందేందుకు అర్హత లభించింది. దీంతో ఆ పదవిని రాహుల్‌ గాంధీకి ఇవ్వాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ జూన్‌లో తీర్మానాన్ని ఆమోదించింది. ఇక ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నకల్లో వయనాడ్‌తోపాటు రాయ్‌బరేలీ నుంచి 3.5 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందిన అనంతరం ప్రతిపక్ష నేతగా   బాధ్యతలు చేపట్టారు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)