Jharkhand Elections: నేడు రాహుల్‌ జార్ఖండ్‌ రాక.. 20న అభ్యర్థుల ఎంపికపై చర్చ

Published on Sat, 10/19/2024 - 09:17

రాంచీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు (శనివారం) జార్ఖండ్ రానున్నారు. రాజధాని రాంచీలోని శౌర్య ఆడిటోరియంలో జరిగే రాజ్యాంగ సదస్సులో ఆయన పాల్గొని, 500 మందికి పైగా ప్రతినిధులతో ఆయన సంభాషించనున్నారు.

రాహుల్‌ గాంధీ తన జార్ఖండ్ పర్యటనలో పార్టీ నేతలతో కూడా సమావేశం కానున్నారు. రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లాక అక్టోబర్ 20న కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జార్ఖండ్‌ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల  ఎంపికపై చర్చించనున్నారు. అదే రోజు మహారాష్ట్రలో కాంగ్రెస్ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. కాగా రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం కాంగ్రెస్‌ కార్యాలయంలో జరిగింది. అభ్యర్థుల పేర్లపై సమావేశంలో చర్చించారు.  రాష్ట్ర ఇన్‌చార్జి గులాం అహ్మద్ మీర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు అనంతరం కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమై ఉన్నామని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి గులాం అహ్మద్ మీర్ మీడియాకు తెలిపారు.  అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత కొనసాగుతుందన్నారు. సీట్ల పంపకానికి సంబంధించి మూడు దఫాలుగా చర్చించామని, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో  కూడా చర్చలు జరిగాయన్నారు.

ఇది  కూడా చదవండి: మియాపూర్‌: ‘చిరుత కాదు.. అడవి పిల్లి’

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)