Breaking News

రాహుల్‌ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్‌ ర్యాలీ

Published on Wed, 07/22/2026 - 11:37

వికారాబాద్‌: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొడంగల్‌లోని తన నివాసం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సీఎం రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నినాళులు అర్పించారు.

కరీంనగర్ జిల్లాలో..
జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. డిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగుల  నిరసన కార్యక్రమంలో పోలీసుల లాఠీఛార్జ్ పై నిరసన ప్రకటించారు. ప్రధాన మంత్రీ నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫ్లెక్సీ లు దగ్ధం చేశారు.

నల్లగొండలో..
నల్లగొండలో గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.

సిద్దిపేట జిల్లాలో.. 
హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అరెస్టులను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత  నిరసన జరిగింది. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ‍పాల్గొన్నారు.  హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో, ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అరెస్టులను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత  నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన విద్యార్థుల నిరసన  ప్రజాస్వామ్యంలో స్వతంత్ర ఉద్యమాన్ని , సత్యాగ్రహాన్ని తలపించింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులు తిరగబడకుండా పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టండి అని గాంధేయ మార్గంలో నిరసన తెలిపారు. అనేక మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థుల లాఠీచార్జ్ పై కనీసం హోంమంత్రి సంఘీభావం తెలపలేదు. ఇప్పటికే ఛాత్రోంకి గుంజ్ పేరుతో దేశ వ్యాప్తంగా విద్యార్థులతో రాహుల్ గాంధీ గారు విద్యా వ్యవస్థ పై మాట్లాడుతు విద్యార్థుల గొంతు వినిపిస్తున్నారని పొంగులేటి అన్నారు. 

కామారెడ్డి జిల్లాలో..
రాహుల్ గాంధీ అరెస్ట్ ను నిరసిస్తూ నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావుపల్లి చౌరస్తాలో 161వహై వే పై జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతా రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆలే మల్లికార్జున్, జుక్కల్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా..
రాహుల్ గాంధీ తో పాటు ప్రతిపక్షాల నేతల అక్రమ అరెస్టు నిరసిస్తూ, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని గాంధీ చౌక్ వద్ద కళ్లకు గంతలు కట్టుకొని కాంగ్రెస్ శ్రేణుల నిరసన తెలిపారు.  నీట్ పరీక్ష పేపర్ లీకేజ్‌కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నిర్మల్ జిల్లా బైంసా..  
ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ముధోల్ నియోజకవర్గం ఇంచార్జ్ నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో ఆందోళన బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)