Breaking News

రాహుల్‌ ప్రధాని అయితే స్కాములే గతి

Published on Sat, 07/01/2023 - 05:59

ఉదయ్‌పూర్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయితే దేశం కుంభకోణాలు, అవినీతిమయంగా మారుతుందని హోం మంత్రి అమిత్‌ షా విమర్శించారు. మళ్లీ నరేంద్ర మోదీయే ప్రధానమంత్రి అయితే మోసగాళ్లంతా కటకటాల వెనక్కి వెళ్తారని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయ్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్‌ షా ప్రసంగించారు. పట్నాలో ఇటీవల జరిగిన ప్రతిపక్ష నేతల భేటీపై ఆయన..‘అక్కడ సమావేశమైన వారంతా అవినీతితో సంబంధం ఉన్నవాళ్లే.

వారి ఆరాటమంతా తమ కుమారుల భవిష్యత్తు కోసమే తప్ప ప్రజలకు మంచి చేయడం కాదు’అని విమర్శించారు. ‘రాహుల్‌ గాం«దీని ప్రధానమంత్రిని చేయడమే సోనియా గాంధీ లక్ష్యం. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ లక్ష్యం తేజస్వీయాదవ్‌ను ప్రధానిని చేయడం, తన మేనల్లుడు అభిషేక్‌ను సీఎంను చేయడమే మమతా బెనర్జీ లక్ష్యం. కొడుకు వైభవ్‌ గెహ్లాట్‌ను సీఎంను చేయడం అశోక్‌ గెహ్లాట్‌ లక్ష్యం’అని ఆయన ఎద్దేవా చేశారు.

రాజస్తాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. గత ఏడాది ఉదయ్‌పూర్‌లో జరిగిన కన్హయ్య లాల్‌ హత్య కేసులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ఉంటే, ఇప్పటికే నిందితులకు ఉరిశిక్ష పడి ఉండేదని పేర్కొన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న సీఎం గహ్లోత్‌ వల్లే నిందితులకు శిక్ష పడటం ఆలస్యమవుతోందని ఆరోపించారు. సస్పెండైన బీజేపీ నేత నుపుర్‌ శర్మకు అనుకూలంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ కన్హయ్య లాల్‌ అనే దర్జీని గత ఏడాది ఇద్దరు దుండగులు పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో కన్హయ్యలాల్‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వం రక్షణ కలి్పంచలేకపోయిందని మంత్రి అన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)