Breaking News

‘పాత నంబర్‌ ఎందుకు మార్చారు?.. చైనాకు కాల్స్‌ ఎందుకు వెళ్లాయి?’

Published on Mon, 04/24/2023 - 12:06

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పొలిటికల్‌ లీడర్ల మధ్య సవాళ్లపర్వం నడుస్తోంది. ఇటీవల రేవంత్‌, ఈటల మధ్య సవాల్‌ ముగిసిన వెంటనే మరో సవాల్‌తో ముందుకొచ్చారు నేతలు. మంత్రి నిరంజన్‌ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది. నిరంజన్ రెడ్డి చేసిన సవాల్‌కు సిద్ధమన్నారు రఘునందన్  రావు. నిరంజన్ రెడ్డిపై ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని.. ఎప్పుడు పిలిచానా  వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన ఆరోపణలకు స్పందించి ఆహ్వానించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

ఇక, తాజాగా రఘునందన్‌ మాట్లాడుతూ.. మంత్రి నిరంజన్‌రెడ్డిపై ఈడీ విచారణ జరపాలి. మంత్రి పాత ఫోన్‌ నెంబర్‌ నుంచి చైనాకు కాల్స్‌ వెళ్లాయి. మంత్రి పాత నెంబర్‌ ఎందుకు మార్చారు?. మంత్రికి ఉన్న దత్తపుత్రులు ఎవరు?. దత్తపుత్రుడికి కాంట్రాక్ట్‌లు.. వియ్యంకుడికి వీసీ పదవులు. కొన్న భూములకు మంత్రి లెక్కలు చూపించాలి. గౌడ నాయక్ పేరు మీద మీ నియోజకవర్గంలో కాంట్రాక్ట్ పనులు అన్నీ చేస్తున్నారు. దత్త పుత్రుడు  గౌడ నాయక్ పేరు మీద పొందిన సబ్సిడీలు ఎన్ని? ఏయే శాఖల నుంచి తీసుకున్నారు?. గ్రౌండ్ నట్ రీసెర్చ్ స్టేషన్ రానే లేదు. అగ్రికల్చర్ యునివర్సిటీ నుంచి దానికి 40 లక్షల రూపాయల కాంట్రాక్ట్‌ను దత్త పుత్రుడికే ఇప్పించుకున్నారు. గ్రౌండ్ నట్ రీసెర్చ్ స్టేషన్ ఎవరు మంజూరు చేశారు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా?. గౌడ నాయక్ కొన్నభూములు ఎలా కొన్నారు? కొన్న డబ్బు ఎక్కడిది? అని ప్రశ్నల వర్షం కురిపించారు. 

అంతకుముందు, కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ భూమిని  కబ్జాచేసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఫాంహౌజ్ కట్టారని రఘునందన్ రావు  ఆరోపించారు.. వనపర్తి జిల్లా చండూరు మండలంలో 160 ఎకరాల్లో  ఫాంహౌజ్ నిర్మించారని  తెలిపారు.  80 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుని 160 ఎకరాలకు కాంపౌండ్ వాల్ కట్టుకున్నారని ఆరోపించారు. కృష్ణానది లోపలి నుంచి 6 మీటర్ల ఎత్తులో గోడ కూడా కట్టారని తెలిపారు. వీటిపై సీఎం కేసీఆర్ యాక్షన్ తీసుకోవాలన్నారు.

దీంతో, రంగంలోకి దిగిన మంత్రి నిరంజన్‌ రెడ్డి.. రఘునందన్‌కు సవాల్‌ విసిరారు. ఆర్డీఎస్ కోసం సేకరించిన భూములను  తాను కబ్జా చేశానని  రఘునందన్ ఆరోపణలు చేయడం  సరికాదన్నారు. ఆధారాలు లేకుండా తనపై అభాండాలు వేయవద్దన్నారు. సాక్ష్యాధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. ఎప్పుడైనా తన భూమి ఉన్న చోటకు వచ్చి చూసుకోవాలన్నారు. తనపై ఆరోపణలు చేసినందుకు రఘునందన్ రావు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  ఆర్డీఎస్ కాల్వ, శ్రీశైలం ముంపు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని మాట్లాడాలన్నారు. రఘునందన్  వస్తే తన భూములు సర్వే చేసి చూపిస్తానన్నారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)