Breaking News

బీఆర్‌ఎస్‌ టైటానిక్‌లా మునిగిపోతుంది

Published on Sun, 06/23/2024 - 04:18

సాక్షి, హైదరాబాద్‌: గత పదేళ్లలో చోటుచేసుకున్న కుంభకోణాలపై విచారణకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్‌ ఇంటికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రాక తప్పదని బీజేపీ మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. అవినీతి, అక్రమాలకు సంబంధించిన వివిధ కేసుల్లో అన్ని వేళ్లూ కేసీఆర్‌ వైపే చూపిస్తున్నాయని ఆయన చెప్పారు. గొర్రెల స్కాం, ఫోన్‌ ట్యాపింగ్‌.. ఇలా వివిధ కేసుల్లో ఇరుక్కున్న అధికారులు అందరూ కేసీఆర్‌ పేరే చెబుతున్నా రన్నారు. రాబోయేరోజుల్లో బీఆర్‌ఎస్‌కు కంపల్సరీ రిటైర్మెంట్‌ స్కీం (సీఆర్‌ఎస్‌) ఖాయమన్నారు. టైటానిక్‌షిప్‌ మాదిరిగా బీఆర్‌ఎస్‌ నావ మునిగి పోతుందని అన్నారు. బీజేపీలోకి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, అలాగే నక్సలైట్లు, మరెవరు వచ్చినా స్వాగతిస్తామన్నారు.

శనివారం తెలంగాణ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’కార్యక్రమంలో రఘునందన్‌ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగు మండలం క్షీరసాగర్‌ గ్రామంలో 80 మంది దళితుల భూములను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు.  పార్లమెంట్‌  సమావేశాలు ముగిసిన వెంటనే తాను క్షీరసాగర్‌ నుంచే పని మొదలుపెడతానని, దళితుల భూములను తిరిగి వారికి అప్పగించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

మీడియా ప్రతి నిధులు అడిగిన వివిధ ప్రశ్నలకు రఘునందన్‌రావు సమాధానాలిస్తూ.. నీట్‌ పరీక్షపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర విభాగానికి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారంపై స్పందిస్తూ.. ‘ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఆదేశాలు తప్పకుండా పాటిస్తా. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ తన అభిప్రాయం వెల్లడించారు’అని అన్నారు. జర్నలిస్ట్‌ యూనియన్‌ సంఘం అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు, ప్రధానకార్యదర్శి బింగిస్వామి పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)