Breaking News

మేం ఓడిపోయాం.. ప్రజలు మోసపోయారు..

Published on Mon, 07/01/2024 - 04:29

ప్రొద్దుటూరు: గత ఎన్నికల్లో తాము ఓడిపోయామని, చంద్రబాబును నమ్మి ప్రజలు మోసపోయారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చెప్పారు. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా­డారు. వాస్తవానికి ఇంకో ఏడాది వరకు ప్రతిపక్ష నేతగా తమకు పని ఉండదని భావించామని, అయితే ఎన్‌డీఏ ప్రభుత్వం తమకు అంత సమ­యం  ఇవ్వలేదని పేర్కొన్నారు. నెలరోజులు కాకముందే ప్రజాసమస్యలను ప్రస్తావించాల్సి వస్తోందన్నారు.

 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రూ.3 వేలు ఉన్న వృద్ధాప్య పింఛన్‌ను రూ.4 వేలకు పెంచడంతోపాటు ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించిన వ్యత్యాసాన్ని కలిపి రూ.7 వేలు జూలై 1న చెల్లిస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఈ ఒక్క పింఛన్లు మాత్రమే జూలై నెలలో పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రకారం దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 వేలు నుంచి రూ.6 వేలకు పెంచడంతోపాటు మూడునెలల వ్యత్యాసాన్ని కలిపి రూ.15 వేలు చెల్లించాల్సి ఉందన్నారు.

మంచానికే పరిమితమైన వారి పింఛన్‌ను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని చెప్పడంతోపాటు మూడునెలల వ్యత్యాసాన్ని కలిపి రూ.25 వేలు చెల్లిస్తామని చెప్పారన్నారు. డయాలసిస్‌ పేషెంట్లకు రూ.10 వేలు ఉన్న పింఛన్‌ను రూ.15 వేలకు పెంచుతామని తెలిపారని, ఈ ప్రకారం మూడునెలల వ్యత్యాసాన్ని కలిపి రూ.30 వేలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పిన ప్రకారం ఈ నెల వివిధ రకాలు పెంచి ఇవ్వాల్సి ఉండగా కేవలం వృద్ధాప్య, వితంతు పింఛన్లు మాత్రమే పెంచి మూడునెలల వ్యత్యాసాన్ని కలిపి ఇస్తున్నారన్నారు.

మిగతా పింఛన్లను పెంచలేదని స్వయంగా అధికారులు చెబుతున్నారని తెలిపారు. నిరుద్యోగులు చంద్రబాబు మాటలు నమ్మి ఓట్లు వేశారని, మళ్లీ వారికి మోసమే జరిగిందని పేర్కొన్నారు. తమ ప్రభు­త్వం వస్తే వలంటీర్లకు రూ.10 వేలు వేతనం పెంచి ఇస్తామని చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయిస్తున్నారన్నారు. దీన్నిబట్టి వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడినట్లేనన్న అనుమానం వ్యక్తమవుతోందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భీముని పల్లి లక్ష్మీదేవి పాల్గొన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)