Breaking News

‘కేజ్రీవాల్‌ ఒక అడాల్ఫ్‌ హిట్లర్‌’

Published on Wed, 01/17/2024 - 19:55

చంఢీఘర్‌: పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ప్రతాప్‌ సింగ్‌ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌)పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌తో పోల్చాడు. ఇప్పటికే.. హర్యాణలోని చంఢీఘర్‌ మేయర్‌ ఎన్నికల్లో ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేస్తాయని ఇటు ఆప్‌ నేత రాఘవ్‌ చద్దా.. అటు కాంగ్రెస్‌ నేత పవన్‌ కుమార్‌ బన్సల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇదే విషయంపై నేడు కొన్ని గంటల ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేజ్రీవాల్‌ భేటీ కూడా అయ్యారు. వారి భేటీ ముగిసిన అనంతరమే పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత ప్రతాప్‌ సింగ్‌ బజ్వా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ను నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌తో పోల్చాడు. కేజ్రీవాల్‌ పాలన హిట్లర్‌ నియంత పాలన వలే ఉంటుందని మండిపడ్డారు. 

మొదట ఆప్‌ పార్టీ కార్యాలయాల్లో డా.బీఆర్‌ అంబేద్కర్‌, భగత్‌సింగ్‌ల వంటి మహనీయుల ఫొటోలను తొలగించాలని.. వాటి స్థానంలో నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ ఫొటోలు పెట్టుకోవాలని దుయ్యబట్టారు. ఆప్‌ నేతలంగా అడాల్ఫ్‌ హిట్లర్‌ వలే ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రతాప్‌ సింగ్‌ వ్యాఖ్యలు ఇరు పార్టీల్లో  తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 

చంఢీఘర్‌ మున్సిపల్‌ ఎ‍న్నికల్లో ఇరు పార్టీలు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమిలో భాగంగా కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. ఆప్‌కు మేయర్‌ పదవి, కాంగ్రెస్‌ పార్టీకి డిప్యూటీ మేయర్‌ పదవి అని కూడా చర్చించుకున్నారు. అయితే ఇప్పటివరకు ప్రతాప్‌ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎవరూ స్పందించకపోవటం గమనార్హం. ఇక.. ప్రతాప్‌ సింగ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు రావొచ్చని ఇరు పార్టీల కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది.

చదవండి: Flight Delays: శశి థరూర్‌కు సింధియా కౌంటర్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)