Breaking News

‘మమ్మల్ని ఆపకండయ్యా..’ పోలీసుల కాళ్లు పట్టుకున్న పులివెందుల ఓటర్లు

Published on Tue, 08/12/2025 - 09:26

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పులివెందులలో పోలీసుల సాయంతో టీడీపీ గూండాలు ఇష్టారాజ్యం రెచ్చిపోతున్నారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులతో ఓట్లు వేయిస్తున్న టీడీపీ.. అసలు ఓటర్లను ఎక్కడికక్కడే అడ్డుకుంటోంది. ఈ క్రమంలో ఖాకీలు ఈ చోద్యమంతా చూస్తూ ఉండిపోతున్నారు. అయితే తాము ఓటు హక్కు వినియోగించుకుంటామంటూ కొందరు ఓటర్లు అనూహ్య రీతిలో నిరసనకు దిగారు. 

పులివెందుల మండలం కనంపల్లిలో గ్రామస్తులను పోలీసులు అడ్డున్నారు. అయితే తమను ఓటు వేయనివ్వండంటూ వాళ్లు పోలీసుల కాళ్లు పట్టుకుంటున్నారు. ‘‘మమ్మల్ని ఆపకండయ్యా.. మా ఓటు మమ్మల్ని వేయనీయండయ్యా’’ అంటూ అభ్యర్థించారు. అయినా పోలీసులు కనికరించలేదు. ఈ క్రమంలో ఇతర గ్రామాల వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారని.. దగ్గరుండి పోలీసులే రిగ్గింగ్‌ చేయిస్తున్నారంటూ స్థానికులు మండిపడ్డారు.

మరోవైపు.. తమనూ ఓటేయకుండా అడ్డుకుంటున్నారంటూ పులివెందుల మండలంలోని పలువురు మహిళా ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇళ్లలోకి దూరి పోలీసులే మమ్మల్ని బెదిరించారు. మీ ఇంట్లో మగవారు ఎటు వెళ్లారు?అంటూ గదమాయించారు. మా చేతుల్లోని ఓటర్ స్లిప్పులను లాక్కున్నారు. ఓటేయడానికి వెళ్తే ఇక‌ అంతే సంగతులు అంటూ బెదిరించారు అంటూ కొందరు వాపోయారు. ఈ స్థాయిలో అరాచకం ఎప్పుడూ చూడలేదని.. వందల మంది స్థానికేతర రౌడీలు తమ ఓట్లను వేస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.

పోలీసుల కాళ్లు పట్టుకున్న పులివెందుల ఓటర్లు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)