Breaking News

‘చెత్త ఎన్నికలు’.. అవినాష్‌ రెడ్డిని తరలిస్తున్న వాహనం అడ్డగింత

Published on Tue, 08/12/2025 - 08:15

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ.. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అరెస్ట్‌ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఉదయం ఆయన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు ఎక్కడికి తరలించాలనుకుంటున్నారో ఓ స్పష్టత లేకుండా ముందుకు సాగారు. తొలుత కడపకు తరలించి.. అక్కడి నుంచి అంతా తిప్పుతూ ఉన్నారు. ఈ క్రమంలో యర్రగుంట్ల వద్ద పోలీసుల వాహనాన్ని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. ఆయన్ని విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు.

ఎలాంటి నోటీసులు, వారెంట్‌ లేకుండా అవినాష్‌​ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేయడంపై మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయన అధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆ వాహానాన్ని ముందుకు కదలనీయలేదు. ఈ క్రమంలో అవినాష్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సుధీర్‌ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు.. 

‘‘మీరు ఎక్కడికి తీసుకురమ్మంటే అక్కడ అవినాష్‌ను దించేస్తాం’’ అంటూ పోలీసులు చెప్పడంతో.. తన నివాసానికి తీసుకెళ్లాలంటూ సుధీర్‌రెడ్డి అదే వాహనం ఎక్కారు. అధికార టీడీపీతో పోలీసులు కుమ్మక్కు అయ్యారని.. పులివెందుల ఉప ఎన్నికకు అవినాష్‌ రెడ్డిని దూరం చేయాలనే కుట్రలో భాగంగానే ఇలా ప్రవర్తిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

ఇదీ చదవండి: బలవంతంగా ఇంట్లోంచి ఈడ్చుకొచ్చి.. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అరెస్ట్‌

యర్రగుంట్లలో పోలీస్‌ వాహనంలోనే ఉండి సాక్షితో ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడారు. ‘‘పులివెందులలో బయటివాళ్లను అనుమతించి.. ఇంట్లో ఉన్న నన్ను బలవంతంగా తరలిస్తున్నారు. ఇది అధికార దుర్వినియోగమే. బీహార్‌లోనూ ఇంతదారుణమైన పరిస్థితులు ఉండవేమో.  దేశానికి స్వాతంత్రం వచ్చాక ఇంత ఘోరమైన.. చెత్త ఎన్నికలు ఎప్పుడూ జరిగి ఉండవు. అసలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉందా? లేదా?. దున్నపోతు మీద వర్షం పడినట్లు ఉంది ఈసీ తీరు. పది రోజుల నుంచి మొత్తుకుంటున్నా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వేల మందిని బయటకు తీసుకొచ్చారు. వాళ్లతో మాపై దాడులు చేయించారు’’ అని మండిపడ్డారాయన.

Pulivendula: అవినాష్ రెడ్డిని ఇంట్లో నుంచి లాక్కొస్తున్న దృశ్యాలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)