Breaking News

పులివెందులలో రౌడీ రాజ్యం.. వైఎస్సార్‌సీపీ నేతలపైనే ఎదురు కేసులు

Published on Thu, 08/07/2025 - 09:19

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోరు వేళ.. తెలుగు దేశం పార్టీ రౌడీలు రాజ్యమేలుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులే టార్గెట్‌గా దాడులకు తెగబడిన పచ్చదండు.. ఇప్పుడు పోలీసుల సాయంతో గాయపడినవాళ్లపైనే తిరిగి కేసులు పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.

బుధవారం.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వేల్పుల రాము, హేమాద్రిలతో పాటు 52 మందిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడం కొసమెరుపు. 

మంగళవారం బీటెక్‌ రవీ అనుచరులు వీరంగం సృష్టించడం, తదనంతరం బుధవారం నల్లగొండువారి పల్లె ఘటనల్లో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే రెండు రోజులుగా జరుగుతున్న పరిణమాల్లో దాడికి పాల్పడిన ఒక్కరినీ పోలీసులు అరెస్ట్‌ చేయలేదు. పైగా ఒంటిపై గాయాలే కనపడకపోతే ఎలా అరెస్ట్ చేస్తాం? అంటూ డీఐజీ కోయ ప్రవీణ్ వెటకారంగా మాట్లాడడమూ చర్చనీయాంశంగా మారింది. 

పులివెందులలో వైఎస్సార్‌సీపీ నేతలపై జరిగిన దాడులకు సంబంధించి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలను అవమానించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. పైగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిపై ఎదురు కేసులు పెడుతున్నారు. మరో వైపు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులపై కొనసాగుతున్న బైండోవర్ కేసులు పెడుతున్నారు. 

రక్తమొడుతున్నట్లు తలలు పగులగొట్టినా.. ఒంటిపై గాయాలు లేవంటూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రచారం చేసే పల్లెల్లో కాకుండా వేరే చోటికి వెళ్లి పత్తి వేపారం చేస్తే రక్షణ కల్పించలేమని, తాము లేకపోతే తలకాయలే ఎగిరి పోయేయంటూ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పోలీసులు దాడులకు తెగబడిన వాళ్ల జోలికి వెళ్లడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. 

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు