Breaking News

నిరుద్యోగంలో రికార్డ్‌ బ్రేక్‌: ప్రియాంక గాంధీ

Published on Thu, 07/18/2024 - 04:30

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల ఉద్యోగాలు సృష్టించామని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా తూర్పార బట్టారు. మంగళవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో సరకుల లోడింగ్‌ కేంద్రం వద్ద చిరు ఉద్యోగాల కోసం వేలాది మంది నిరుద్యోగ యువత క్యూ వరసల్లో నిల్చుని తొక్కిసలాట వంటి పరిస్థితి తలెత్తిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రియాంక గుర్తుచేశారు. 

‘‘ కొద్దిరోజుల క్రితం ముంబైలో మోదీ మాట్లాడు తూ మేం కోట్లాది మందికి ఉపాధి కల్పించి రికార్డ్‌లు బ్రేక్‌ చేశామని ఢంకా బజాయించారు. కానీ అదే ముంబైలో  చిన్నపాటి ఉద్యోగాల కోసం వేలాదిగా యువత ఆశతో ఎగబడటం మనందరం చూశాం. ఇదే ఏడాది గుజరాత్‌లో 25 ఉద్యోగాల కోసం ఏకంగా లక్షలాది మంది నిరుద్యోగులు తండోపతండాలుగా తరలిరావడమూ మనందరికీ తెల్సిందే. ఇవన్నీ చూస్తుంటే రికార్డ్‌లు బ్రేక్‌ అయినట్లు తెలుస్తూనే ఉంది. కానీ ఆ రికార్డ్‌లు నమోదైంది ఉద్యోగాల్లో కాదు నిరుద్యోగంలో. దేశాన్ని తీవ్ర నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తోంది. ఇప్పటికైనా మోదీ ఉత్తమాటలు చెప్పడం మానేసి ఉపాధి అవకాశాలపై దృష్టిపెట్టాలి’’ అని ప్రియాంక నిలదీశారు. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)