Breaking News

బిహార్‌ ప్రజలు అన్ని రికార్డులు బద్దలు కొట్టారు: ప్రధాని మోదీ

Published on Fri, 11/14/2025 - 19:28

ఢిల్లీ: బిహార్‌లో సుపరిపాలన, అభివృద్ధి విజయం సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బిహార్‌ ప్రజలు అద్భుత విజయం అందించారన్నారని.. ప్రజలు వికసిత్‌ భారత్‌కు ఓటేశారన్నారు. బిహార్‌లో ఇవాళ ప్రతీ ఇంట మఖానా పాయసం వండుకుని సంతోషిస్తారన్న మోదీ.. బిహార్‌ జంగిల్‌ రాజ్‌ అన్నప్పుడు ఆర్జేడీ నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేదని.. బిహార్‌లో ఆ జంగిల్‌ రాజ్‌ ఎప్పటికీ తిరిగిరాదన్నారు.

మేం ప్రజలకు సేవకులం.. వారి మనసులు గెలుచుకున్నాం. రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొని ఏన్డీఏకు అద్భుత విజయం అందించారు. బిహార్‌ ప్రజలు అన్ని రికార్డులు బద్దలుకొట్టారు. జంగిల్‌ రాజ్‌లో ఏం జరిగిందో అందరికి తెలుసు. జంగిల్‌రాజ్‌లో దోపిడీ, అక్రమాలు, హింస ప్రజలు అనుభవమే. ఈ విజయంతో ఎన్నికల సంఘంపై ప్రజలకు విశ్వాసం పెరిగింది. ఒకప్పుడు బిహార్‌లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది. అరాచక శక్తుల కారణంగా ఎన్నికలు మధ్యాహ్నం 3 గంటలకే ముగిసిపోయేది. కానీ ఇప్పుడు ప్రజలంతా స్వేచ్ఛగా, ధైర్యంగా వచ్చి రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొన్నారు.’’ అని మోదీ పేర్కొన్నారు.

సునామీ తరహాలో తీర్పు: జేపీ నడ్డా
ప్రధాని మోదీ నేతృత్వంలో బిహార్‌లో ఎన్డీఏ అద్బుత విజయం సాధించింది. బిహార్‌ ప్రజలు సునామీ తరహాలో తమ తీర్పును వెలువరించారు. ఈ అద్భుత విజయం బీజేపీని మరింత బలోపేతం చేసింది. బాధ్యత పెంచింది. ప్రధాని మోదీపై ప్రజలు మరోసారి తమ ప్రేమను విశ్వాసాన్ని చూపించారు. మహారాష్ట, ఢిల్లీలో కూడా బీజేపీని ప్రజలు అద్భుతంగా ఆదరించారు. రికార్డు స్థాయిలో అత్యధిక స్థానాల్లో బీజేపీని గెలిపించారు. మహాగఠ్‌ బంధన్‌ను బీహారీలు తిరస్కరించారు.

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)