Breaking News

ప్రజాధనం దుర్వినియోగం

Published on Sun, 11/16/2025 - 12:12

పట్నా: ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకువశ్నిచ్చిన రూ.14 వేల కోట్లను బిహార్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టడానికి బదులుగా సీఎం నితీశ్‌ ప్రభుత్వం దారి మళ్లించిందని జన్‌ సురాజ్‌ పార్టీ చీఫ్‌ ప్రశాంత్‌ కిశోర్‌ ఆరోపించారు. ఆ డబ్బును అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళల ఖాతాల్లో రూ.10వేల చొప్పున జమ చేసి, వారిని మశ్నిచ్చిక చేసుకునేందుకు వాడుకుందని విమర్శించారు. ఇది కశ్నిచ్చితంగా ప్రజాధనాన్ని దురి్వనియోగం చేయడమేనన్నారు. 

ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాల్పడిన అనైతిక చర్యగా ఆయన అభివరి్ణంచారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రశాంత్‌ కిశోర్‌ డిమాండ్‌ చేశారు. బిహార్‌ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించడం తెల్సిందే. ఈ ఫలితాలను ప్రభావితం చేసిన అంశాల్లో రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేయడం కీలకంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. 

‘ఎన్నికల ఫలితాలను కొనుగోలు చేశారు. జూన్‌ 21వ తేదీ నుంచి పోలింగ్‌ జరిగే వరకు అధికారపక్షం ఏకంగా రూ.40 వేల కోట్లను ఖర్చుపెట్టింది. ప్రజాధనాన్ని ప్రజల ఓట్లను కొనేందుకు వాడుకుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడానికి కేవలం గంట ముందుగా మహిళల బ్యాంకు అకౌంట్లకు డబ్బును బదిలీ చేసింది. 

ఇందుకు ప్రపంచబ్యాంకు నిధులను వాడినట్లు మాకు తెల్సింది’అని జన్‌సురాజ్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్‌ సింగ్‌ తెలిపారు. ఖజానా ఉన్న డబ్బంతా ఎన్నికల్లో గెలవడానికే నితీశ్‌ ప్రభుత్వం ఖర్చు చేసింది. అధికారంలోకి వచ్చాక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేందుకు మిగిలింది ఖాళీ ఖజానాయేనని ఆ పార్టీ ప్రతినిధి పవన్‌ వర్మ తెలిపారు. రాష్ట్రం మొత్తం అప్పు రూ.4.06 లక్షల కోట్లకు చేరుకోగా రోజుకు రూ.63 కోట్ల చొప్పున వడ్డీ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తోందని వెల్లడించారు.  
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)