Breaking News

టీడీపీ దమనకాండ.. హైకోర్టు ఆదేశాలంటే లెక్కలేదా?: పొన్నవోలు

Published on Sat, 06/22/2024 - 17:35

సాక్షి, హైదరాబాద్‌: చట్టాన్ని లెక్క చేయకుండా ఏపీలో ప్రభుత్వం పనిచేస్తుందని.. హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని కూల్చేశారని మాజీ ఏఏజీ, సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గుర్తింపు పొందిన పార్టీలకు ఆఫీస్‌లు కట్టుకోవడానికి చంద్రబాబే 340 జీవో తీసుకొచ్చారన్నారు. పాలకులు మారొచ్చు.. కానీ చట్టం మారదు. న్యాయవ్యవస్థ ఆదేశాలను తుంగలో తొక్కారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.

‘‘తెలుగుదేశం పార్టీ 340 ప్రకారం ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలకు భూములు తీసుకుంది. ఎకరాకు వెయ్యి రూపాలకే తెలుగుదేశం భూములు పొందింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సైతం అదే ప్రకారం రెండు ఎకరాలు చట్టపరంగా తీసుకుంది. పర్మిషన్‌ తీసుకోలేదని ఏడురోజుల్లో తొలగించాలని ప్రొవిజనల్ నోటీస్ ఇచ్చారు. మేము సవాల్ చేస్తూ.. లంచ్ మోషన్ వేశాం. కూల్చేస్తున్నారని కోర్టుకు చెప్పాం. డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతామని చట్టానికి లోబడి పనిచేస్తామని కోర్టుకు తెలిపారు. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చేంతవరకు కూల్చకూడదని చట్టం చెబుతుంది.’’ అని పొన్నవోలు తెలిపారు.

‘‘చట్టం 115 సీఆర్‌డీఏ యాక్ట్ కింద వివరణ అడగాలి, వివరణ కూడా ఇచ్చాము. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూల్చివేతలు చేపట్టారు. కోర్టు ఆదేశాల విషయం సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్‌కు మెయిల్, వాట్సప్ ద్వారా తెలిపాం’’ అని పొన్నవోలు వివరించారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)