Breaking News

పెట్టుబడులపై రేవంత్ మంత్రి వర్గంలోనే భిన్నాభిప్రాయాలా?: పొన్నాల

Published on Tue, 01/28/2025 - 18:00

సాక్షి, హైదరాబాద్‌: దావోస్‌ పెట్టుబడులపై సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దావోస్ పెట్టుబడులను పెద్ద విజయంగా సీఎం చెబుతుంటే మంత్రి శ్రీధర్ బాబు మాత్రం ఇది పెద్ద విజయం ఏమీ కాదన్నారు. ఉపాది అవకాశాలు పెరిగినపుడే పెట్టుబడులను విజయంగా భావిస్తామని శ్రీధర్ బాబు అన్నారు. రేవంత్ మంత్రి వర్గంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి’’ అంటూ పొన్నాల వ్యాఖ్యానించారు.

‘‘సీఎం మొహం చూసి ఎవ్వరూ పెట్టుబడులు పెట్టలేదు. పెట్టుబడులు అనేవి నిరంతర ప్రక్రియ. పదేళ్ల కేసీఆర్ విధానాల ఫలితంగానే ఈ పెట్టుబడులు. మహారాష్ట్రకు 18 లక్షలు కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చాయంటే ఫడ్నవీస్ గొప్పతనం చూసి రాలేదు. అక్కడ ప్రభుత్వం మారి ఆరునెలలు కూడా కాలేదు. ప్రపంచ దేశాలతో పోటీ పడతా అని రేవంత్ అంటున్నారు. దేశాలతో కాదు.. మహారాష్ట్రతో రేవంత్ పోటీ పడాలి. ఈ పెట్టుబడులు ఎందుకు వచ్చాయో వివరించడానికి సీఎం మంత్రులతో చర్చకు సిద్ధం’’ అని పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు.

‘‘2014, 2023 మధ్య 2 వేల స్టార్ట్అప్ కంపెనీలు వచ్చాయి. హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ కేసీఆర్ హయాంలో 7 లక్షలు స్క్వేర్ ఫీట్ లకు పెరిగింది. ఐటీ ఇన్నోవేషన్‌లో కేసీఆర్ హయాం లో తెలంగాణ నాలుగు శాతానికి పెరిగింది. 2014లో 3 లక్షలు ఐటీ ఉద్యోగాలు ఉంటే అది కేసీఆర్ విధానాల ఫలితంగా తొమ్మిది లక్షలకు పెరిగింది. ఏ రకంగా చూసినా కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ ఐటీ, పారిశ్రామిక రంగంలో భారీ పురోగతి సాధించింది.

..వాస్తవాలను సీఎం రేవంత్ వక్రీకరిస్తున్నారు. అప్పుడు వేసిన విత్తనాలకు ఇపుడు కాయలు కాస్తుంటే రేవంత్ తన గొప్ప అని చెప్పుకుంటే ఎట్లా?.స్కిల్ డెవెలప్మెంట్ అనేది వ్యక్తులను బట్టి ఆధారపడి ఉంటుంది. అన్ని అవకాశాలున్నా రేవంత్ ఎందుకు చదువుకోలేదు? ఎందుకు విజ్ఞానవంతుడిగా కాలేక పోయారు?. రేవంత్ భాష, స్వభావం అలా ఉండటానికి దేశంలో విద్యావకాశాలు లేక కాదు. కేసీఆర్ గురుకులాలు స్థాపించి అందరికీ ఉన్నత అవకాశాలు కల్పించారు’’ అని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు