Breaking News

రెండు మూడ్రోజుల్లో ఆ బాంబు పేలుతుంది: పొంగులేటి

Published on Sat, 11/02/2024 - 16:26

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్షం మాట్లాడాలి.. ఏదో ఒకటి మాట్లాడకపోతే ప్రతిపక్షం ఎలా అవుతుంది? అంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెటైరికల్‌గా కౌంటర్ ఇచ్చారు. ‘‘నేను పేల్చిన బాంబు ఇంకా తుస్సు కాలేదు.. రెండు మూడు రోజుల్లో ఆ బాంబు ఏంటో మీరే చూస్తారు. వచ్చే నాలుగేండ్ల ఒక నెల సీఎంగా రేవంత్‌రెడ్డినే ఉంటారు.’’ అని పొంగులేటి స్పష్టం చేశారు. త్వరలోనే గ్రామ సర్పంచ్‌లు అందుబాటులోకి వస్తారు. సంక్రాంతి లోపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి అన్నారు.

ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా గ్రీన్ చానెల్‌లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరుగుతుంది. లబ్ధిదారుని ఖాతాలోకి నేరుగా నిధుల జమ చేస్తాం. ప్రారంభంలో లక్ష ఇస్తారు. ఫిల్లర్స్ 1.25 లక్షలు, స్లాబ్ 1.75 లక్షలు ఇళ్లు పూర్తి అయ్యాక 1లక్ష ఇస్తారు. ఇందిరమ్మ ఇళ్లు లబ్ధి కోసం రేషన్ కార్డు తప్పనిసరి కాదు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ గురించి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో మాట్లాడా. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందనే సంకేతాలు ఇప్పటి వరకు ఉంది.’’ అని పొంగులేటి చెప్పారు.

‘‘కేంద్రం నుంచి నిధులు వస్తే మంచిది.. లేకపోతే నేను ఇండ్లను కట్టిస్తాను. ప్రారంభానికి కేంద్ర మంత్రులను పిలుస్తాం.. నేన,  సీఎం వెళ్లి కేంద్ర మంత్రిని ఆహ్వానిస్తాం. వచ్చే నాలుగేళ్లు 20 లక్షలు ఇండ్లను టార్గెట్ పెట్టుకున్నాం’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి: మా దగ్గర ‘బీఆర్‌ఎస్‌’ జాతకాలు.. అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)