Breaking News

ఢిల్లీ చేరుకున్న పొంగులేటి, జూపల్లి

Published on Mon, 06/26/2023 - 05:05

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో వారిద్దరూ తమ ముఖ్య అనుచరులతో కలసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాందీని కలవనున్నారు. ఇందుకోసం ఆదివారం రాత్రి 9 గంటలకు వారు ఢిల్లీ చేరుకున్నారు.

ఈ కార్యక్రమం కోసం నలుగురు ఏఐసీసీ ఇన్‌చార్జీలతోపాటు 22 మంది రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు ఆహ్వానం అందింది. దీంతో చాలా మంది నాయకులు ఆదివారం రాత్రే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మరికొందరు సోమవారం ఉదయం చేరుకో నున్నారు. పొంగులేటి, జూపల్లి బృందంతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి, వి. హనుమంతరావు, రేణుకాచౌదరి, జీవన్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, బలరాం నాయక్, శ్రీధర్‌బాబు, మధుయాష్కీ గౌడ్, దామోదర రాజనర్సింహ, పోదెం వీరయ్య,జగ్గారెడ్డి, మల్లు రవి, మహేశ్‌కుమార్‌ గౌడ్, షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, రోహిత్‌ చౌదరి, పీసీ విష్ణునాథ్, మన్సూర్‌ అలీఖాన్, వంశీచందర్‌రెడ్డిలను ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానం అందింది.

వారిలో 20 మందికిపైగా నేతలు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిసింది. పొంగులేటి, జూపల్లి వెంట పాయం వెంకటేశ్వర్లు, మువ్వా విజయ్‌బాబు, బానోతు విజయాబాయి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, మేఘారెడ్డి తదితరులు వెళ్లనున్నట్లు తెలిసింది. వీరంతా ఖర్గే, రాహుల్‌ గాంధీని కలసి తెలంగాణ రాజకీయాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా కాంగ్రెస్‌ నేతలకు ఏఐసీసీ మార్గనిర్దేశం చేయనుంది. ఈ సమావేశంలోనే ఖమ్మంలో పొంగులేటి బృందం పార్టీలో చేరిక, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించాల్సిన బహిరంగ సభ తేదీలు కూడా ఖరారు కానున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. 

ఆట మొదలవుతోంది: పొంగులేటి 
ఆదివారం రాత్రి ఢిల్లీ ఎయిర్‌పోర్టు వద్ద పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నామని వ్యాఖ్యానించారు. ఆట మొదలవుతోందని.. ఆటను పర్‌ఫెక్ట్‌గా ఆడబోతున్నామంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదని ప్రజలు భావిస్తున్నారని... ఇప్పుడు రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని పొంగులేటి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సహా 4–5 జిల్లాల నుంచి నేతలం కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చలకు వచ్చామని చెప్పారు. ఇతర పార్టీల నేతలు, ఇతర ప్రాంతాల నేతలు సైతం పెద్ద ఎత్తున చేరబోతున్నారన్నారు. ఖర్గే, రాహుల్‌తో భేటీ అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తానని పొంగులేటి తెలిపారు. 

ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత కోసమే: మల్లు రవి 
రాష్ట్రాన్ని నియంతలా పాలిస్తున్న కేసీఆర్‌ను గద్దె దించేందుకే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని మాజీ ఎంపీ, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని, అదేవిధంగా రాష్ట్రంలోనూ కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని, అందులో భాగంగానే ఈ చేరికలని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని పౌర హక్కుల సంఘాలు, కుల సంఘాలు, ప్రజాస్వామికవాదులు చేయీచేయీ కలిపి బీఆర్‌ఎస్‌ నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధం కావాలని మల్లు రవి పిలుపునిచ్చారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)