Breaking News

మహారాష్ట్రలో రసవత్తర రాజకీయం.. ఆ ఒక్క ఎమ్మెల్సీ ఎవరు?

Published on Thu, 07/11/2024 - 19:57

ముంబై: మహారాష్ట్రలో పలు శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ అక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీల పెద్దలు అలర్ట్‌ అయ్యారు. దీంతో, ‘మహా’ రాజకీయం రీసార్ట్‌లకు చేరింది.

కాగా, మహారాష్ట్రలో రేపు(శుక్రవారం) 11 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక, 11 స్థానాలకు గాను 12 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక, రాష్ట్రంలో ఇద్దరు అభ్యర్థులు గెలుపునకు అవసరమయ్యే మెజార్టీ ఎంవీఏకు ఉన్నప్పటికీ మూడో అభ్యర్థిని నిలబెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపిన శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్‌ ఠాక్రే.. మిలింద్‌ నార్వేకర్‌తో నామినేషన్‌ వేయించారు. దీంతో మూడో స్థానంలోనూ గెలుపొందేందుకు అవసరమైన ఓట్ల కోసం ఎంవీఏ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేలను ప్రత్యేక ప్రాంతాలకు తరలించాయి. క్రాస్‌ ఓటింగ్‌ భయం నేపథ్యంలో శివసేన (యూబీటీ), ఏక్‌నాథ్‌ శిందే వర్గాలు తమ ఎమ్మెల్యేలను రిసార్టులు, లగ్జరీ హోటళ్లకు తరలించినట్లు తెలిసింది. మరోవైపు.. శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) మాత్రం తమ నేతల కోసం ఎలాంటి హోటళ్లను బుక్‌ చేయకపోవడం ఆసక్తికరంగా మారింది. 
 

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)