Breaking News

టీడీపీలో టికెట్ల ఎఫెక్ట్‌.. చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

Published on Mon, 02/26/2024 - 11:57

సాక్షి, కాకినాడ: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ-జనసేన కూటమి తొలి విడతలో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలుచోట్ల టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. కొందరు నేతలు ఇప్పటికే టీడీపీ, జనసేనకు గుడ్‌బై చెప్పారు. 

ఇక, తాజాగా కాకినాడ రూరల్ టీడీపీలో అసమ్మతి సెగ రాజుకుంది. కాకినాడ స్థానం జనసేనకు కేటాయించడంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కమ్రంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి నివాసాన్ని టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. వెంటనే టీడీపీకి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. జనసేనకు టికెట్‌ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆవేదనకు లోనైన టీడీపీ కార్యకర్త లోవరాజు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని కాపాడారు. 

మరోవైపు.. ఉండవల్లి చంద్రబాబు నివాసం వద్ద కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. తంబళ్లపల్లె టికెట్‌ శంకర్‌ యాదవ్‌కు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. తంబళ్లపల్లె టికెట్‌ను జయచంద్రారెడ్డికి కేటాయించడాన్ని శంకర్‌, ఆయన వర్గం వ్యతిరేకిస్తోంది. 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)