Breaking News

ఎన్నికల బరిలో విచిత్ర పార్టీలు!

Published on Wed, 04/10/2024 - 08:51

లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఓటింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మొదటి దశలో బీహార్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు (నవాడ, జముయి, ఔరంగాబాద్, గయ) ఓటింగ్ జరగనుంది. మరోవైపు బీహార్‌లో విచిత్రమైన పేర్లు కలిగిన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

ఈ పార్టీల పేర్లు అందరి దృష్టిని ఆకర్షించేలా ఉన్నాయి. ఈ జాబితాలో ఆల్ హింద్ ఫార్వర్డ్ బ్లాక్ (రివల్యూషనరీ), స్మార్ట్ పార్టీ, లాగ్ పార్టీ, న్యూమరికల్ పార్టనర్‌షిప్ పార్టీ మొదలైనవి ఉన్నాయి. ప్రముఖ నేత చిరాగ్ పాశ్వాన్ బావమరిది గౌతమ్ పాశ్వాన్ సమజ్దార్‌ పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేశారు. భారతీయ ఏక్తా పార్టీ నుంచి అనిల్ చౌదరి, భారతీయ లోక్ చేతన పార్టీ నుంచి గుడియా దేవి, రాష్ట్రీయ జన సంభవ పార్టీ నుంచి శ్రవణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ పార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో ఎన్నికల సంఘం రద్దు చేసింది.

బీహార్‌లోని గయ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు విచిత్రమైన పేర్లు కలిగిన మూడు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో భారతీయ లోక్ చేతన పార్టీకి చెందిన శివశంకర్ పోటీకి దిగారు. డెమోక్రటిక్ సమాజ్ వాదీ పార్టీ నుంచి ధీరేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఔరంగాబాద్ లోక్‌సభ స్థానం నుండి లాగ్ పార్టీకి చెందిన అజిత్ శర్మ  నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స్థానం నుంచి జనజాగరణ్‌ పార్టీకి చెందిన శంభు ఠాకూర్‌ కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే వీరి నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)