Breaking News

కాంగ్రెస్‌కు క్యూ కడుతున్న నేతలు.. హస్తంలో ఇమడగలరా?

Published on Sun, 06/11/2023 - 21:16

ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇతర పార్టీల వారిని రమ్మంటే పారిపోయారు. కాని కర్నాటక ఫలితాలు కాంగ్రెస్ జాతకాన్ని మార్చేశాయి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి క్యూ కడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందేమో అన్న ఆశ వారిని ఆ పార్టీ వైపు నడిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా పరిస్థితి అలాగే  ఉంది. గతంలో వెళ్ళిపోయినవారు, కొత్తగా కొంతమంది కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు బారులు తీరారు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ నిన్నా మొన్నటి వరకు కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా ఉండేది. పార్టీ నుంచి బయటకు వెళ్ళేవారే తప్ప వచ్చేవారే లేరు. కానీ, కర్నాటక ఎన్నికల ఫలితాలు టీకాంగ్రెస్ ఫేట్ మార్చేశాయి. ఇతర పార్టీలకు వెళ్ళివారు వచ్చేస్తామంటున్నారు. ప్రత్యర్థి పార్టీలోని వారు కూడా హస్తానికి జై కొడుతున్నారు. తాజా పరిణామాలు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌కు జీవం పోస్తున్నాయి. గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోవడంతో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ బయటకు వెళ్ళిపోయారు. టిక్కెట్ లభించిన రామారావు పటేల్ ఓడిపోయి తర్వాత బీజేపీలో చేరిపోయారు. అలా ముథోల్ నియోజకవర్గంలో ఇద్దరు నేతలు పార్టీని వీడిపోయారు.

రామారావు పటేల్ వెళ్ళిపోవడంతో బీఆర్‌ఎస్‌లో ఉన్న నారాయణరావు పటేల్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించగా నిరాకరించారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చేందుకు నారాయణరావు పటేల్ ఆసక్తిగా ఉన్నారట. వయస్సు మీరిపోవడంతో తాను పోటీ చేయకపోయినా తన కుమారుడు అఖిలేష్ పటేల్‌ను ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానంటే కాంగ్రెస్‌లోకి రావడానికి సిద్ధమంటున్నారట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రూప్‌తో పాటు హస్తం గూటికి చేరేందుకు రెడీగా ఉన్నారట నారాయణరావు పటేల్. అదేవిధంగా నిర్మల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీహరిరావు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దమవుతున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మీద తిరుగుబాటు చేసిన శ్రీహరిరావు ఎలాగైనా ఆయన్ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. అందుకే పొంగులేటి వర్గంతో పాటు కారు దిగి చేయి పట్టుకుని నడవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. 

సింగరేణిలో డాక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ రాజా రమేష్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్నారు. చెన్నూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఈ డాక్టర్ కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. అదేవిధంగా ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్‌లో చేరడానికి భారీగా ముందుకు వస్తున్నట్లు టాక్. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే ఆమడ దూరం పారిపోయినవారంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే దిక్కని వస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రూప్‌తో పాటు వీరంతా ఒకేసారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.

కర్నాటక ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ నింపింది నిజమే. కానీ ఆ జోష్‌ను ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఎంతవరకు నిలుపుకుంటారన్నదే ప్రశ్న. మూడు ముఠాలు, ఆరు గ్రూప్లుగా వర్ధిల్లుతున్న కాంగ్రెస్‌లోకి కొత్తవారు వచ్చి ఇమడగలరా? టిక్కెట్ల విషయంలో పాతవారితో పోటీ పడగలరా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: సునీల్ కనుగోలు రిపోర్టులో ఏముంది?.. టీకాంగ్రెస్‌ నేతల్లో కొత్త టెన్షన్‌!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)