Breaking News

కూటమిలో కుంపటి.. జేసీకి బీజేపీ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published on Fri, 01/03/2025 - 11:56

సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అనంతపురంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. నిన్న బీజేపీ నేతలపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేయగా.. నేడు ప్రభాకర్‌ రెడ్డికి కాషాయ పార్టీ నేతలు కౌంటరిచ్చారు. ఇదే సమయంలో జేసీ ప్రభాకర్‌ రెడ్డిని టీడీపీ పార్టీ కంట్రోల్‌ చేయాలని బీజేపీ నేత హితవు పలికారు.

తాజాగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ సీరియస్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీనటి మాధవీలతపై జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరం. ప్రభాకర్ రెడ్డి ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. బీజేపీ నేతలను హిజ్రాలతో పోల్చటం జేసీ ప్రభాకర్ రెడ్డి అవివేకానికి నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడే జేసీ ప్రభాకర్ రెడ్డి వీరంగం చేస్తారు. అధికారం లేకపోతే పలాయనం.. జేసీ విధానం. ఇప్పటికైనా ప్రభాకర్ రెడ్డిని టీడీపీ కంట్రోల్ చేయాలి. ఆయన ఇలాంటి వైఖరితో టీడీపీ ప్రభుత్వానికే చేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ఇక, అంతకుముందు ‍ప్రభాకర్‌ రెడ్డి.. బీజేపీ నేతలపై సంచలన కామెంట్స్‌ చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్.. నాపై లేనిపోని ఆరోపణలు చేశాయని మండిపడ్డారు. జేసీ ఈవెంట్‌పై విమర్శలు చేసిన బీజేపీ నేత యామిని శర్మ, సినీనటి మాధవీలతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అలాగే, అనంతపురంలో నా బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక, ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు లేదా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో జరిగి ఉంటుందని ట్రావెల్స్‌ మేనేజర్‌ అనంతపురం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, గురువారం రాత్రి జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం బస్సు ప్రమాదం కుట్రపూరితంగా జరిగినట్లు ఆరోపించడం సంచలనంగా మారింది.  

ఫ్లైయాష్‌ వివాదమే కారణమా? 
నిజానికి.. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆర్టీపీపీలో ఫ్లైయాష్‌ రవాణా విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి జేసీ ప్రభాకర్‌రెడ్డికి మధ్య ఇటీవల తీవ్ర వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో వీళ్లిద్దరి పంచాయతీ సీఎం వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలను ఉద్దేశించి ప్రభాకర్‌రెడ్డి విమర్శించి ఉండవచ్చునని తెలుస్తోంది.  

 జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)