Breaking News

చంద్రబాబు సభ.. తాడిపత్రి టీడీపీలో పొలిటికల్‌ వార్‌

Published on Wed, 09/10/2025 - 09:06

సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా తాడిపత్రి టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ మధ్య పొలిటికల్‌ వార్‌ కొనసాగుతోంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా తమ బల ప్రదర్శనకు ఇరు వర్గాల నేతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యం జేసీ వర్గం హెచ్చరికలతో తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. సీఎం చంద్రబాబు తాడిపత్రి పర్యటన నేపథ్యంలో టీడీపీలో వర్గపోరు పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. సొంత పార్టీ నేతల వాహనాలపై విధ్వంసానికి జేసీ ప్రభాకర్‌ రెడ్డి వర్గీయులు సిద్దమయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ మధ్య వర్గాల మధ్య రాజకీయం ఘర్షణలకు దారి తీస్తోంది. తాడిపత్రి నుంచి జేసీ ఫోటో ఉన్న వాహనాలే చంద్రబాబు సభ వద్దకు వెళ్లాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోటో లేని వాహనాలు ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో జేసీ వర్గం.. నిర్దేశిత ఫార్మాట్, ఆడియోను విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఆడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరోవైపు.. సుమారు వంద వాహనాల్లో చంద్రబాబు సభకు వెళ్లాలని టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ ఏర్పాట్లు చేశారు. జేసీ వర్గానికి కౌంటర్‌ ఇస్తూ వాహనాలపై స్టిక్కర్లు వేసినట్టు సమాచారం. ఇక, జేసీ వర్గం హెచ్చరికలతో తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉండగా.. ఇటీవల వినాయక నిమజ్జనం సందర్భంగా రాళ్లు జేసీ ప్రభాకర్‌-కాకర్ల రంగనాథ్ వర్గీయులు రాళ్లతో దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)