Breaking News

బీజేపీ ‘చలో గజ్వేల్‌’ భగ్నం

Published on Sat, 09/02/2023 - 05:12

సాక్షి, కామారెడ్డి: సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట జరిగిన వనరుల విధ్వంసాన్ని ప్రజలకు చూపించడం కోసం బీజేపీ చేపట్టిన ‘చలో గజ్వేల్‌’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి వెంకటరమణారెడ్డిని ఒకరోజు ముందుగానే గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేసి బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

శుక్రవారం ఉదయం నుంచి భారీసంఖ్యలో బీజేపీ శ్రేణులు వెంకటరమణారెడ్డి ఇంటికి తరలిరాగా, వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తీసుకెళ్లారు. దీంతో జిల్లాకేంద్రంలో ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. వెంకటరమణారెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార ఆధ్వర్యంలో కార్యకర్తలు, నేతలు ఆందోళన చేశారు. రామారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో నిజామాబాద్‌ అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఆందోళన చేపట్టారు.

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు కారులో హైదరాబాద్‌ నుంచి బిచ్కుంద పోలీసుస్టేషన్‌కు బయలుదేరగా పెద్దకొడప్‌గల్‌ మండలకేంద్రం శివారులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన నడుచుకుంటూ పెద్దకొడప్‌ గల్‌కు చేరుకుని రెండుగంటలపాటు నిరీక్షించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు ఆయన ఫోన్‌ చేసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. పోలీసులు సాయంత్రం వెంకట రమణా రెడ్డిని విడిచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడు తూ గజ్వేల్‌లో అక్రమాలు వెలుగులోకి వస్తాయని, సీఎం చెబుతున్న అభివృద్ధికి సంబంధించిన గుట్టు రట్టవుతుందన్న ఉద్దేశంతోనే తనను అడ్డుకున్నారని ఆరోపించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)