Breaking News

ప్రియాంక పోటీచేస్తే ప్రధాని ఓడేవారు

Published on Wed, 06/12/2024 - 03:18

రాయ్‌బరేలీ: ప్రధాని మోదీ పోటీచేసిన వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ పోటీచేస్తే ఆమె రెండు, మూడు లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గేవారని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. రాయ్‌బరేలీలో తనను, అమేథీలో కిశోరీలాల్‌ శర్మను గెలిపించినందుకు గుర్తుగా మంగళవారం రాయ్‌బరేలీలో ఏర్పాటుచేసిన ‘కృతజ్ఞత కార్యక్రమం’లో అమేథీ, రాయ్‌బరేలీ ఓటర్లనుద్దేశించి రాహుల్‌ కొద్దిసేపు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో ప్రియాంక, అమేథీ ఎంపీ కిశోరీలాల్‌ శర్మ పాల్గొన్నారు. ‘‘ పార్లమెంట్‌లో ఎన్‌డీఏ బలాన్ని తగ్గించేందుకే రాయ్‌బరేలీ, అమేథీ సహా దేశవ్యాప్తంగా నియోజకవర్గాల్లో విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు ఉమ్మడి గా పోరాడాయి. ‘‘ బీజేపీ నాయకుల గెలుపు అహంకారాన్ని మేం పట్టించుకోం. మా ఆలోచనంతా ప్రజా సమస్యల గురించే.

అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ, ఇతరత్రా కార్యక్రమాల్లో బడా పారిశ్రామికవేత్తలకు అతి విలువ ఇచ్చి సాధారణ జనాలను మోదీ గాలికొదిలేశారు. వారి సమస్యలను పట్టించుకోలేదు. అందుకే ఏకంగా అయోధ్యలోనూ బీజేపీకి ఓటమి రుచి చూపించి ఓటర్లు బుద్ధి చెప్పారు’’ అని అన్నారు. 

అవధ్‌ గొప్ప సందేశమిచ్చింది: ప్రియాంక
అమేథీ, రాయ్‌బరేలీలో బీజేపీని ఓడించి ఇక్కడి అవధ్‌ ప్రాంతం ఉత్తరప్రదేశ్‌కేకాదు యావత్‌భారతానికి చక్కటి సందేశం ఇచ్చిదని, మనకు వాస్తవికమైన స్వచ్ఛమైన రాజకీయాల అవసరం ఉందని ప్రియాంకా అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)