Breaking News

ఆప్‌,కాంగ్రెస్‌లపై ప్రధాని ఫైర్‌

Published on Sun, 02/02/2025 - 16:05

న్యూఢిల్లీ:బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్క మురికివాడను కూడా తొలగించబోమని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. మురికివాడల్లో కూల్చివేతల విషయంలో ఆమ్‌ఆద్మీపార్టీ‌ అధినేత కేజ్రీవాల్‌ తమపై చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధమన్నారు. ఆదివారం(ఫిబ్రవరి2) ఢిల్లీ ఆర్కేపురం ప్రాంతంలో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని ఆప్‌,కాంగ్రెస్‌ పార్టీలపై విమర్శలు గుప్పించారు. 

‘ఢిల్లీలో ఒక్క మురికివాడను కూడా తొలగించం. మేం మాటలు చెప్పే వాళ్లం కాదు మాటకు కట్టుబడే వాళ్లం. బడ్జెట్‌లో రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయించి ఇది రుజువు చేశాం. మేం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మోస్ట్‌ ఫ్రెండ్లీ బడ్జెట్‌. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలకు అందుతున్న ఏ సంక్షేమ పథకాన్ని కూడా మేం వచ్చాక ఆపబోము. బిహార్‌,పూర్వాంచల్‌ నుంచి ఢిల్లీకి వచ్చి జీవనం సాగిస్తున్న వారికి అండగా ఉంటాం.

కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీలు రెండూ అవినీతి పార్టీలే.కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణలో కాంగ్రెస్‌ పార్టీపై పడ్డ అవినీతి మచ్చ ఎ‍ప్పటికీ పోదు.స్పోర్ట్స్‌ యూనివర్సిటీ పేరుతో ఆప్‌ ఢిల్లీ యువతను మోసం చేసింది’అని ప్రధాని విమర్శించారు. కాగా, ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగనుండగా 8వ తేదీ ఫలితాలు వెల్లడవనున్నాయి. 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)