Breaking News

‘రాష్ట్రంలో శత్రువులు.. ఢిల్లీలో చెట్టాపట్టాలు!

Published on Tue, 02/27/2024 - 17:11

తిరువనంతపురం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో ఎప్పుడూ విడిపోని ప్రాణ స్నేహితులని కానీ కేరళ మాత్రం బద్దశత్రువులని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ యాత్ర ముగింపు సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

‘కేరళలో కాంగ్రెస్‌ పార్టీ, లెఫ్ట్‌ పార్టీలు ఒకరికొకరు శత్రువులు. ఇతర రాష్ట్రాల్లో మాత్రం ప్రాణ స్నేహితులు. ఈ పార్టీలు తిరువనంతపురం భిన్నమైన భాష మాట్లాడి.. ఢిల్లీలో మాత్రం ఒకే భాష మాట్లాడుతాయి’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. మరోవైపు కేరళలో కాంగ్రెస్‌ పార్టీ సీపీఐ(ఎం) ప్రత్యర్థులు.. అదే పశ్చిమ బెంగాల్‌లో మాత్రం మళ్లీ మిత్రపక్షాలు. ఇటువంటి వైరుధ్యాలు కలిగిఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఢిల్లీ, గుజరాత్‌, గోవాల్లో సీట్లు సర్దుబాటు చేసుకుందని దుయ్యబట్టారు. 

‘కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ అవినీతిపరుడు. కేరళలో గత కమ్యూనిస్ట్‌ పార్టీ పాలకులు కాంగ్రెస్‌ కార్యకర్తలపై లాఠీ చార్జీలు చేశారు. కమ్యూనిస్ట్‌ నేత పలు కుంభకోణాలకు పాల్పడ్డారు. కానీ.. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’లో మాత్రం ఇరుపార్టీ నేతలు ఢిల్లీలో కూర్చొని బిస్కెట్లు, సమోసాలు తింటూ చాయ్‌ తాగుతారు’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు.

కేరళలో ఒకటి చెప్పి.. ఢిల్లీలో మరోటి చెప్పి ద్రోహం చేసేవారికి (కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు) వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేరళ ప్రజలు తగినబుద్ధి చెప్పాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కేరళలో బీజేపీకి డబుల్‌ డిజిట్‌ సీట్లు ఇవ్వాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. కేంద్ర పథకాలతో కేరళ లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో 20 సీట్లలో కాంగ్రెస్‌ పార్టీ 15 సీట్లను గెలుచుకోగా.. బీజేపీ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)