Breaking News

PM Narendra Modi: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య... చిచ్చుకు కాంగ్రెస్‌ కుట్ర

Published on Sun, 11/10/2024 - 14:26

బొకారో: దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య చిచ్చుపెట్టి అధికారం దక్కించుకోవాలన్నదే కాంగ్రెస్‌ వ్యూహమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు దోచుకోవడానికి కాంగ్రెస్‌ రాజకుటుంబం కుట్రలు చేస్తోంది. స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి ఆ వర్గాల ఐక్యతను కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తూనే వస్తోంది. వాటి మధ్య ఐక్యత లేనంతకాలం కేంద్రంలో అధికారం చలాయించి దేశాన్ని లూటీ చేసింది’’ అని ఆరోపించారు.

 మనం సురక్షితంగా ఉండాలంటే కలసికట్టుగా ఉండాలని మరోసారి పిలుపునిచ్చారు. ఆదివారం జార్ఖండ్‌లోని బొకారో, గుమ్లా పట్టణాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌–జేఎంఎం కూటమి ఓబీసీలను కులాలవారీగా ముక్కలు చేయజూస్తోందని మండిపడ్డారు. ఉప కులాల మధ్య మంటలు పెట్టి చలి కాచుకోవాలని చూస్తోందన్నారు. 

మాఫియాల భరతం పడతాం 
జార్ఖండ్‌లో తిష్టవేసిన అక్రమ వలసదార్లను వెళ్లగొట్టాలంటే, అవినీతిని అంతం చేయాలంటే బీజేపీ గెలవాలని మోదీ అన్నారు. ‘‘జేఎంఎం కూటమి పాలనలో పిడికెడు ఇసుక కూడా దొరక్క ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పాలకులు మాత్రం ఇసుక దోచుకున్నారు. ఖనిజ సంపద, అడవులు, కొండలు, నదులు, బొగ్గు అన్నీ లూటీ చేశారు. కోట్లు కొల్లగొట్టారు. రిక్రూట్‌మెంట్‌ మాఫియా, పేపర్‌ లీక్‌ మాఫియాను సృష్టించారు. అవినీతి నేతను వదిలే ప్రసక్తే లేదు. వారిని జైలుకు పంపుతం. మేం గెలిచాక జార్ఖండ్‌ను అభివృద్ధి చేస్తాం’’ అని మోదీ ఉద్ఘాటించారు. గిరిజనులు ఉన్నత స్థానాలకు చేరితే కాంగ్రెస్‌ ఓర్వలేదని ఆరోపించారు. గిరిజన బిడ్డ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నించిందన్నారు. ఆమెను ఇప్పటికీ అవమానిస్తూనే ఉందని ఆక్షేపించారు. 

అంబేడ్కర్‌కు ఘన నివాళి 
జమ్మూకశ్మీర్‌లో తొలిసారి ఒక ముఖ్యమంత్రి భారత రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేశారని మోదీ అన్నారు. ‘‘ఇది అంబేడ్కర్‌కు దక్కిన ఘన నివాళి. అక్కడ ఆరి్టకల్‌ 370ని మళ్లీ తేవాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు ప్రయతి్నస్తున్నాయి. అదే జరిగితే అక్కడ రాజ్యాంగం మరోసారి అమలవకుండా పోతుంది. మన సైనికులు ఉగ్రవాదులతో తలపడాల్సి వస్తుంది’’ అన్నారు.  

రాంచీలో రోడ్‌ షో 
జార్ఖండ్‌ రాజధాని రాంచీలో మోదీ ఆదివారం 3 కిలోమీటర్ల మేర రోడ్‌ షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు.  
 

చదవండి:  10వ తరగతిలో ఉగ్రవాదిని అవ్వాలనుకున్నా : ఎమ్మెల్యే

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)