Breaking News

‘పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి కాదు ఉప్మా మంత్రి’

Published on Mon, 06/08/2026 - 12:30

సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. బాబు పాలనలో అరాచకం రాజ్యమేలుతుందన్న ఆయన.. పోలీసులతో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా చాకిరి చేయించుకుంటుందని అన్నారు. పోలీసులకు అన్యాయం జరుగుతుంటే కానిస్టేబుల్‌ కుమారుడు పవన్‌ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నాని మీడియాతో మాట్లాడారు. 

‘ప్రభుత్వ విభాగంలో అన్నీ శాఖల్లో మోసం చేసినట్లుగా కానిస్టేబుళ్లను మోసం చేస్తున్నారు. కానిస్టేబుళ్లకు ఇచ్చే సరండర్‌ లీవల్‌ను వన్‌ బై టూ చేశారు.కానిస్టేబుళ్లకు ఇవ్వాల్సిన ఆరు సరండర్‌ లీవ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. పోలీసులకు టీఏలు కూడా ఇవ్వడం లేదు. లా అండ్‌ ఆర్డర్‌ పని చేసే ఒక్కో పోలీస్‌కు రూ.70వేలకు పైగా బాకీ ఉన్నారు.మందు తాగమని చంద్రబాబే చెబుతారు. తర్వాత డ్రండ్‌ అండ్‌ డ్రైవ్‌లు పెడతారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పేరు చెబితే పోలీసులకు నిద్ర పట్టడం లేదు.

ప్రతి పీఎస్‌ పరిధిలో రోజుకు ఐదు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు పెట్టాలని టార్గెట్‌ పెట్టారు. చంద్రబాబు మాటలను నమ్మి పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలను, కార్యకర్తలను కొట్టారు. పోలీసులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం దేవుడెరుగు, వడగాల్పుల్లో అల్లాడి పోతున్నారు. జీవో 329 ఎందుకు అమలు కావడంలేదో చంద్రబాబు చెప్పాలి. ఏపీఎస్పీలో పదేళ్లు సర్వీస్‌ నిండినవారిని ఏఆర్‌కు ఎందుకు పంపడం లేదు?.ఏపీఎస్పీలో వెట్టి చాకిరి చేస్తూ రిటైర్‌ అవుతున్నారు. పోలీసుల పట్ల కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది.

ఉప్మా మంత్రి.. మాట్లాడితే మా నాన్న.. మా నాన్న.. పవన్ పై మాస్ ర్యాగ్లింగ్

పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి కాదు ఉప్మా మంత్రి. పోలీసులకు అన్యాయం జరుగుతుంటే కానిస్టేబుల్‌ కుమారుడు పవన్‌ ఎక్కడున్నారు. ఓట్లు అడుకునేటప్పుడు కానిస్టేబుల్‌ కుమారుడు  ఇప్పుడు ఎందుకు మాట్లాడరు?. హోం మంత్రి అనిత హోం శాఖ గురించి తప్పితే అన్నీ మాట్లాడుతారు. వైఎస్‌ జగన్‌ను తిట్టడానికి మాత్రమే మంత్రి అనితను వాడుకుంటున్నారు’అని ధ్వజమెత్తారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)