Breaking News

చంద్రబాబు, లోకేష్‌​ కుర్చీలను ఎప్పుడో మడతపెట్టేశాం: పేర్ని నాని

Published on Mon, 02/19/2024 - 15:33

సాక్షి, కృష్ణా:  2019లో చంద్రబాబు, లోకేష్‌​ కుర్చీలను మడతపెట్టేశామని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 2024లో కూడా మళ్లీ వాళ్ల కుర్చీలు మడతపెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఊరూరా షామియానా కంపెనీలో కుర్చీలు అద్దెకు తెచ్చుకోవడం వల్ల ఉపయోగం లేదని..మీ సమావేశాల్లొ  ఖాళీగా ఉన్న కుర్చీలు మడతపెట్టి ఎక్కడ పెట్టాలో చూసుకోండని చురకలంటించారు. గురివింద గింజకు ఒక్కచోటే మచ్చ.. కానీ బాబుకు నిలువెళ్లా మచ్చలేనని విమర్శించారు. చంద్రబాబు పేరు చెప్తే.. ఒక్క పథక కూడా గుర్తుకు రాదని అ‍న్నారు.  

చంద్రబాబు సవాల్‌కుపేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పిట్టల దొరలా ఊరూరా తిరిగి హామీలిచ్చాడని మండిపడ్డారు. బందరులో ఓట్లు అడుక్కోవడానికి వచ్చి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. బందరు పోర్టును పూర్తిచేశావా?. మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నావ్.. మూడు గజాలైనా ఇచ్చావా అని ప్రశ్నించారు. ఆక్వా హబ్‌ను చేస్తానన్నావ్ చేశావా?. హైదరాబాద్ నుంచి బందరుకు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానని మోసం చేశాడన్నారు.

ఎన్నికల ముందు మాటిచ్చి ఓటేసిన తర్వాత మోసం చేసే గుణం ఉన్నోడే చంద్రబాబు అని పేర్ని నాని దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మండిపడ్డారు. 99 శాతం హామీలు నెరవేర్చిన నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. సీఎం  గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్కపథకమైనా ఉందా అని ప్రశ్నించారు. 


చదవండి: బాబుకన్నా దుర్మార్గులు ఎవరుంటారు?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)