Breaking News

Exit Poll: మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీదే హవా!

Published on Wed, 02/11/2026 - 18:20

హైదరాబాద్‌: తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఇవాళ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబుబ్ నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు కొనసాగిందని పీపుల్స్ పల్స్ పేర్కొంది.

కరీంనగర్, నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు. ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. నిజమాబాద్, కరీంనగర్, మహబుబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎంఐఎం కింగ్ మేకర్ కానుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ గెలిచే అవకాశాలు లేవు’’ అని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది.

‘‘రామగుండంలో కాంగ్రెస్ 30-34, బీఆర్ఎస్ 16-20, బీజేపీ 3-6, ఇతరులు 4-7 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. మంచిర్యాలలో కాంగ్రెస్ 39-43, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-9, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. కొత్తగూడెంలో కాంగ్రెస్ 28-34, బీఆర్ఎస్ 7-9, సీపీఐ 14-16, ఇతరులు 2-4 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది

మహబుబ్‌నగర్‌లో  కాంగ్రెస్ 26-30, బీఆర్ఎస్ 18-22, బీజేపీ 6-8, ఎంఐఎం 2-4, ఇతరులు 0-1 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. నల్లగొండలో కాంగ్రెస్ 21-26, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-10, ఎంఐఎం 2-4, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. నిజమాబాద్‌లో కాంగ్రెస్ 10-16, బీఆర్ఎస్ 2-4, బీజేపీ 26-31, ఎంఐఎం 8-12, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. కరీంనగర్‌లో  కాంగ్రెస్ 14-16, బీఆర్ఎస్ 10-12, బీజేపీ 24-29, ఎంఐఎం 6-9, ఇతరులు 1-3 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది.

68-76 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. 29-36 మున్సిపాలిటీలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, 3-5 బీజేపీ, 0-1 ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉంది. 8-14 మున్సిపాలిటీల్లో ‘నువ్వా నేనా?’ అన్నట్టు పోటీ ఉంది. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి 36 శాతం, బీఆర్ఎస్ కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం, ఏఐఎంఐకు 2 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. -కాంగ్రెస్ పార్టీ 1210-1290, బీఆర్ఎస్ 860-930, బీజేపీ 250-270, ఏఐఎంఐఎం 35-44, సీపీఐ 12-17, సీపీఎం 10-14, ఇతరులు 90-110 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది’’ అని  పీపుల్స్ పల్స్ వెల్లడించింది.

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు