Breaking News

నీలాగా వెన్నుపోటు పొడిచానా?.. చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్‌

Published on Sun, 01/28/2024 - 14:35

సాక్షి, పుంగనూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కనీసం కుప్పంలో కూడా చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు అంటూ ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక చౌకబారు విమర్శలకు దిగారంటూ సీరియస్ కామెంట్స్‌ చేశారు. 

కాగా, మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం పుంగనూరులో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు మితిమీరి నాపై విమర్శలు చేస్తున్నాడు. నీ లాగా నేను మామకు వెన్నుపోటు పొడిచానా?. చంద్రబాబు నువ్వు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కనీసం కుప్పంలో కూడా గెలవలేవు. కుప్పంకు మేము నీళ్లు ఇస్తున్నాం. కానీ, నువ్వు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశావ్‌?. ఓటమి భయంతో రాజకీయంగా ఎదుర్కోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. 

సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవుతుందని చంద్రబాబు విమర్శించారు. ఈరోజు బాబు షూరిటీ.. భవిషత్తు గ్యారంటీ అంటున్నారు. గతంలో ఎన్టీఆర్‌ను గద్దె దింపగానే మద్యపాన నిషేదం ఎత్తివేశారు, రెండు రూపాయల కిలో బియ్యం తీసేశారు. 2014లో ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చారా?. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి రాగానే రెండు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగాలను తొలగించారు. ఇన్నిసార్లు మోసం చేసిన చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మరు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలు కూడా చూడకుండా పథకాలు అందిస్తున్నారు. గతంలో జన్మభూమి కమిటీలు పెట్టీ టీడీపీకి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చారు. పేదరికాన్ని కొలబద్దగా తీసుకుని ప్రజలకు అండగా నిలిచింది సీఎం జగన్ మాత్రమే. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పథకాల అమలుపై సీఎం జగన్ దృష్టి సారించారు. చంద్రబాబు నాపై విమర్శలు చేస్తున్నారు. నేను ఎలాంటి వాడినో ప్రజలకు తెలుసు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలు బుద్ధి చెబుతారు. చంద్రబాబు మోసకారి మాటలు నమ్మవద్దు.. అధికారంలోకి రాలేము అని దూషణలు మొదలు పెట్టారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నాడు. నువ్వు వెన్నుపోటు పొడిచి జిల్లా మొత్తానికి చెడ్డపేరు తెచ్చావు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)