Breaking News

ఆధారాలుంటే నిరూపించండి.. చంద్రబాబుకు పెద్దిరెడ్డి సవాల్‌

Published on Wed, 08/07/2024 - 13:19

సాక్షి, చిత్తూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారని.. కావాలనే తమ పార్టీ నేతలపై అవాస్తవాలు రాయిస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మదనపల్లె కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం  ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ చేయించుకోవచ్చని తేల్చి చెప్పారు.

‘‘చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు వ్యతిరేకంగా పనిచేశారు. మదనపల్లెలో రికార్డులు తగలపడితే మాపై నిందలు వేస్తున్నారు. కార్యకర్తలతో మాపై తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారు. ఆధారాలు ఉంటే నిరూపించండి. తప్పుడు ఆరోపణలు చేసి అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. మా కుటుంబం పై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. మా ఆస్తులను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచాం. కేసులు వేసి వేధించే ప్రయత్నం చేస్తున్నారు’’ పెద్దిరెడ్డి మండిపడ్డారు.

టీడీపీ కుట్రలు రాష్ట్ర ప్రజలకు తెలుసు. రికార్డులు కాలిపోయాయని డీజీపీ హెలికాప్టర్ వేసుకొని వచ్చారు.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. రాజకీయ రంగు పులిమి.. అత్యుత్సాంతో కుట్రలు చేస్తున్నారు. కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల హామీలు నెరవేర్చాలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సూపర్‌ సిక్స్‌ అంటే చంద్రబాబు భయపడుతున్నారు. ఖజానాలో డబ్బులు లేవని సాకులు వెతుక్కుంటున్నారు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా క్యారక్టర్ దెబ్బ తీసేవిధంగా చేస్తున్నారు. తాము అధికారంలోకి ఉన్నప్పుడు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు‘‘ అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

 

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)