Breaking News

బాబు స్ఫూర్తి?.. పవన్‌ ఓవరాక్షన్‌

Published on Fri, 08/11/2023 - 19:21

సాక్షి, విశాఖపట్నం: పుంగనూరు హింసాత్మక ఘటనతో రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీయాలనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్ర భగ్నం అయ్యింది. అంత ఉద్రిక్త పరిస్థితుల్లోనూ పోలీసులు సంయమనం పాటించి పరిస్థితిని చెయ్యి జారిపోకుండా అదుపు చేసుకున్నారు. ఈ తరుణంలో బాబు స్ఫూర్తితో ఆయన దత్తపుత్రుడు పవన్‌ కల్యాన్‌ ఇవాళ విశాఖ పర్యటనతో అలాంటి ఉద్రిక్తతలనే రాజేయాలని ప్రయత్నించారేమో అనిపించకమానదు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ్టి విశాఖ పర్యటనలో మామూలు ఓవరాక్షన్‌ చేయలేదు. ఎప్పటిలాగే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాదు.. నిబంధనలకు విరుద్ధంగా అభిమానులతో ర్యాలీ కూడా నిర్వహించాడు. ఎప్పటిలాగే పోలీసులతో సైతం వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే దిశగా పరిస్థితి మారింది. కానీ, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఇక నిబంధనలకు అనుగుణంగా రుషికొండపై నిర్మాణాలు జరుగుతుంటే.. ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఉన్న పవన్‌ ఇష్టానుసారం విమర్శలు చేసుకుంటూ పోయారు.

హడావిడి తప్ప ఏముంది?
పవన్‌ సేమ్‌ ఆరోపణలతో రుషికొండను గతంలోనూ పర్యటించాడు. మరి అప్పటికీ.. ఇప్పటికీ ఏం మార్పు వచ్చిందని నిలదీస్తున్నారు స్థానికులు.  ఎందుకంటే పవన్‌ పర్యటన వల్ల ఇవాళ వాళ్లు బాగా ఇబ్బంది పడ్డారు కాబట్టి!.  ఉదయం నుంచే తన పర్యటన అంటూ లీకులు ఇచ్చి.. జనసైనికుల్ని, అభిమానుల్ని గుమిగూడేలా చేశారు పవన్‌. ఇక సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చి.. హడావిడి చేసి వెళ్లాడంతే.   ఈ క్రమంలో ఫ్యాన్స్‌, జనసైనిక్స్‌కు తప్ప పవన్‌ పర్యటన వల్ల ప్రజలకు ఒరిగిందేం లేదని, పైగా ఈ పర్యటనతో తాము ఇబ్బంది పడాల్సి వచ్చిందని జనం తిట్టుకుంటున్నారు.

ఇక పవన్‌ ఆదేశాలతో జోడిగుళ్లపాలం వద్ద జనసేన నేతల పేరిట కొందరు చేసిన హడావిడి అయితే మామూలుగా లేదు. ఏకంగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు వాళ్లు. ఇదిలా ఉంటే.. రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారంటూ ఇప్పటికే జనసేనానికి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. 

ఇదీ చదవండి: వారాహి యాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)