Breaking News

చంద్రబాబు నుంచే పవన్‌కళ్యాణ్‌కు ముప్పు!

Published on Mon, 06/19/2023 - 04:07

తాడేపల్లిగూడెం అర్బన్‌: జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తనకు ప్రాణహాని ఉందని ఎందుకన్నారో తెలియదుగానీ అయితే అది చంద్రబాబు నుంచే ఉం­దని గ్రహించాలని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. ‘తమ్ముడూ పవన్‌.. చంద్రబాబుపై ఓ కన్నేసి ఉంచు! ఆయన్ను ఓ కంట కనిపెడుతూ జాగ్రత్తగా ఉండాలి’ అని హెచ్చరించారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

టీడీపీ అధికారంలో ఉండగా పేదల నాయకుడు వంగవీటి మోహన్‌రంగా హత్య­కు పన్నాగం పన్నిన వారిలో చంద్రబాబు హస్తం ఉందని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌కు ఏదైనా జరిగితే ఆ నెపాన్ని వైఎస్సార్‌సీపీ పైకి నెట్టి రాజ­కీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌ పాలిచ్చే ఆవును వదిలేసి తన్నే దున్నపోతు లాంటి చంద్రబాబును విశ్వసిస్తున్నా­రని వ్యాఖ్యానించారు. పవన్‌ వెనుక తిరుగుతున్న వారంతా తమ పరిస్థితి కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లు అవుతుందని భయపడుతున్నట్లు చెప్పా­రు. 

పవన్‌ సీఎం అభ్యర్థి అని ప్రకటిస్తారా? 
స్థిరత్వం లేని మాటలతో ప్రజల్లో చులకన కావద్దని పవన్‌కు మంత్రి సత్యనారాయణ హితవు పలికారు. గతంలో తనకు ముఖ్యమంత్రి అయ్యే సీన్‌ లేదన్న పవన్‌ ఇప్పుడు అందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థి గా ప్రకటించగలరా? అని చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. మహానాడు అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో కాపు సామాజికవర్గం ఓట్ల కోసం పవన్‌ కల్యాణ్‌ను పావులా వాడుకుంటున్నారని చెప్పారు. సొంతంగా పార్టీ పెట్టిన పవన్‌ కల్యాణ్‌ 175 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులతో  పోటీ చేయించాలన్నారు.

జగన్‌ పాలనలో ప్రతి ఇంటా సిరులపంట
సీఎం జగన్‌ పాలనలో ప్రతి ఇంటా సిరుల పంటగా ఉందని మంత్రి సత్యనారాయణ తెలిపారు. ప్రతి మహిళకూ లక్ష్మీ కటాక్షం లభిస్తోందన్నారు. పది కాలాల పాటు వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే తమ కుటుంబాలు నిలబడతాయని ప్రజలు భావిస్తున్నారన్నారు. పోలవరంలో రివర్స్‌ టెండర్లతో రూ.1,300 కోట్లు ఆదా చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు.

టీడీపీ పాలనలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను వెలికి తీస్తుంటే శాంతి భద్రతలు లోపించాయంటూ విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలోనే దేవాలయాలను కూల్చిన విషయం పవన్‌కల్యాణ్‌ తెలుసుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రూ.281 కోట్లతో 250 దేవాలయాల పునర్నిర్మాణంతోపాటు 5,000 దేవాలయాల్లో నిత్య ధూపదీప నైవేద్యాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నూతనంగా మరో 2,000 ఆలయాలను నిర్మిస్తున్నామన్నారు.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)