Breaking News

జనసేనాని పొలిటికల్‌ కన్ఫ్యూజన్‌.. ఎంపీగా పవన్‌ పోటీ?

Published on Fri, 03/08/2024 - 13:44

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ ఒంటరిగా వెళ్తుంటే.. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై పోటీలో నిలుస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాలో అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

మరోవైపు.. ఎన్నికల్లో పొత్తు కోసం చంద్రబాబు, పవన్‌ ఢిల్లీ బాటపట్టారు. బీజేపీతో ఎలాగైనా పొత్తుపెట్టుకోవాలని బాబు, దత్తపుత్రుడు హస్తినలో మకాం వేశారు. ఇక, పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థులను ప్రకటించినప్పటికీ పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ పోటీ చేస్తారనేది మాత్రం వెల్లడించలేదు. కాగా, పవన్‌ రెండు చోట్ల పోటీ చేస్తారని జనసేన నుంచి లీకులు మాత్రం బయటకు వస్తున్నాయి. అయితే, రెండు అసెంబ్లీ స్థానాలే కాకుండా ఒక అసెంబ్లీ నియోజకవర్గం, మరోచోట పార్లమెంట్‌ స్థానం నుంచి పవన్‌ పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇదంతా బాగానే ఉన్నా.. రెండుచోట్ల పోటీ చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే దానిపై పవన్‌ తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఎంపీగా ఏ స్థానం నుంచి పోటీచేయాలనే విషయంపై కూడా సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఎన్డీయే నుంచి కేంద్రంలో మంత్రి పదవి తీసుకునే యోచనలో పవన్‌ కల్యాణ్‌ ఉన్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

చివరగా.. ఏ దిక్కు లేకపోతే ఢిల్లీనే దిక్కు కదా!. అంతకుముందు టీడీపీతో జనసేన పొత్తు సందర్బంగా ఎన్నో చీవాట్లు తిన్నానని చెప్పాడు. అన్ని చీవాట్లు తిన్నది ఎందుకనుకుంటున్నారు?. 24 సీట్లతో ఊరబొడిచేదేమీ లేదు. ఎన్ని గెలుస్తామో తెలియదు. అసలు అభ్యర్థులు ఎవరో చివరి దాకా స్పష్టత లేదు. ఇప్పుడు మిగిలిందొక్కటే కమల నాథుల కరుణ కటాక్షం. ఎంపీగా గట్టిగా ప్రయత్నిస్తే.. ఓడినా ఢిల్లీ వాళ్లే చూసుకుంటారు అనేది పవన్‌ ధీమా. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)