Breaking News

టీడీపీ కోసం మరో అభ్యర్థిని మార్చేసిన పవన్‌

Published on Thu, 04/04/2024 - 15:56

సాక్షి, అన్నమయ్య:  జనసేన శ్రేణుల అభిప్రాయాలను ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పూచిక పుల్లలా తీసి పారేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ ఇంకా ఒకట్రెండు పెండింగ్‌ స్థానాలకు అధికారికంగా అభ్యర్థుల్ని ప్రటించాల్సి ఉంది. అయితే ఈలోపే ప్రకటించిన స్థానాల్లోనూ మార్పునకు దిగింది. అదీ ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారనే!. తాజాగా రైల్వే కోడూరు అభ్యర్థిని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మార్చేశారు. 

రైల్వే కోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్‌ పేరును గురువారం మధ్యాహ్నాం ప్రకటించింది జనసేన పార్టీ. యనమల భాస్కర్‌ స్థానంలో అరవ శ్రీధర్‌ను అభ్యర్థిగా పోటీలో నిలుపుతున్నట్లు ఒక నోట్‌ రిలీజ్‌ చేసింది. క్షేత్రస్థాయి నివేదికలు, జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఈ మార్పు చేసినట్లు సదరు నోట్‌ తెలిపింది. అయితే.. యనమల ఇంకా ప్రచారంలోకి దిగకముందే ఈ మార్పు చోటు చేసుకోవడం గమనార్హం. అదే సమయంలో.. ముక్కావారి పల్లె గ్రామసర్పంచ్‌గా ఉన్న అరవ శ్రీధర్‌.. మూడు రోజుల కిందటే జనసేనలో చేరడం గమనార్హం.

అంతకు ముందు.. రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా యనమల భాస్కర్‌పై సర్వేల్లో సానుకూలత రాలేదని.. మిత్రపక్షమైన టీడీపీ నుంచి కూడా అనుకూలత లేకుండా పోయిందంటూ అభ్యర్థి మార్పుపై జనసేన నేరుగా ప్రకటన చేసేయడం గమనార్హం. ఇప్పటికే ఆళ్లగడ్డ సీటును టీడీపీ నుంచి వచ్చిన మండలి బుద్ధ ప్రసాద్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. మన్యం పాలకొండ స్థానం సైతం టీడీపీ నుంచే వలస వచ్చిన నిమ్మక జయకృష్ణకే దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. నేడో, రేపో ఆ ప్రకటన కూడా వెలువడనుంది. 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)