Breaking News

ఇండియా కూటమితో టచ్‌లో పశుపతి పరాస్‌!

Published on Tue, 03/19/2024 - 21:49

రాష్ట్రీయ లోక్‌జనశక్తి (ఆర్‌ఎల్‌జేపీ) పార్టీ చీఫ్‌  పశుపతి కుమార్‌ పరాస్‌.. ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బీహార్‌లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో తనకు అన్యాయం జరగటంతో ఎన్డీయే  కూటమితో పాటు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం ప్రకటించారు.  అయితే ఆయన ప్రతిపక్షాల ఇండియా కూటమికి టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. 

పశుపతి పరాస్ ఎన్డీయేకు గుడ్‌బై చెప్పిన వెంటనే ఆర్జేడీ నేత తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ స్పందిస్తూ.. బిహార్‌లోని ప్రతిపక్ష కూటమికి ఆహ్వానించారు. ‘ఒకవేళ  పశుపతి పరాస్‌ బీహార్‌ ప్రతిపక్ష కూటమిలోకి రావాలనుకుంటే.. మేము స్వాగతం చెప్పడానికి ఎప్పుడూ సిద్ధమే. రాజీనామా చేసిన పరాస్‌ను బీజేపీ ఏం చేయలేదు’ అని అన్నారు. అయితే పరాస్‌.. పలు లోక్‌సభ స్థానాలతో పాటు హాజీపూర్‌ సెగ్మెంట్‌ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. 

తనకు ఎంతో కీలకమైన హాజీపూర్‌ స్థానంలో కచ్చితంగా పోటీ చేస్తానని.. అవసరమైతే ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడానికి కూడా సిద్దమేని ఇటీవల పరాస్‌ ప్రకటించారు. అయితే సోమవారం బీజేపీ.. పరాస్‌ను పక్కనబెట్టి  జేడీయూ, లోక్‌ జనశక్తి పార్టీ (రాం విలాస్‌)తో సీట్ల పంపకం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పశుపతి పరాస్‌ ఎన్డీయే నుంచి తప్పుకున్నారు.

మరోవైపు పరాస్‌కు కంచుకోట అయిన హాజీపూర్‌లో బీజేపీ.. లోక్‌ జనశక్తి పార్టీ (రాం విలాస్‌) పార్టీ అభ్యర్థికి టికెట్‌ కేటాయించటం గమనార్హం. ఒకవేళ పరాస్‌ ఇండియా  కూటమిలో చేరితే ఆయనకు హాజీపూర్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ కేటాయిస్తుందో లేదో వేచి చూడాలి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)